ఆర్డీవోపై వేటేసిన సర్కార్‌

పెద్దపల్లి,జూన్‌4(జ‌నం సాక్షి ): పెద్దపల్లి ఆర్డీవో అశోక్‌ కుమార్‌పై ప్రభుత్వం వేటు వేసింది. ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తూ కలెక్టర్‌ శ్రీదేవసేన ఉత్తర్వులు జారీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, సింగరేణి భూసేకరణలో అక్రమాలే కారణంగా భావిస్తున్నారు. కమాన్‌పూర్‌ మండలం జయ్యారం భూసేకరణలో 2 కోట్ల చెల్లింపులకు గాను.. రూ. 25 కోట్లుకు అంచనాలు పంపించినట్లు ఆర్డీవోపై ఆరోపణలున్నాయి. అయితే రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా… ఉత్తమ అధికారిగా అశోక్‌కుమార్‌ అవార్డు అందుకున్నారు. అంతలోనే కలెక్టర్‌ అవినీతిపై సరెండర్‌ చేయడం గమనార్హం.