ఆర్డీవో కార్యాలయంలో సామూహిక గీతాలపన.

ఫొటో రైటప్: ఆర్డీవో కార్యాలయం ముందు గీతాలపన చేస్తున్న ఆర్డీవో శ్యామల దేవి, సిబ్బంది.
బెల్లంపల్లి, ఆగస్టు16, (జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఆర్డీవో కార్యాలయం ముందు ఆర్డీవో శ్యామల దేవితో పాటు సిబ్బంది సామూహిక జాతీయ గీతాలపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆర్డీవో శ్యామల దేవి మాట్లాడుతూ దేశ ప్రజల్లో భక్తి భావం పెంపొందించేందుకై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు సామూహిక జాతీయ గీతాలపన కార్యక్రమం నిర్వహించినట్లు ఆమె పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.