ఆర్థిక భారంతో సతమతమవుతున్న విఆర్ ఏ లు
బిక్షటనతో బియ్యం నిత్యావసర వస్తువుల పంపిణీ
డోర్నకల్ అక్టోబర్ 2 జనం సాక్షి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వీఆర్ఏలకు పేస్కేల్,అర్హత కలిగిన విఆర్ ఏ లకు ప్రమోషన్లు మరియు 55 సంవత్సరములు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తానని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి రెండు సంవత్సరములు గడిచిన ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వలన విఆర్ ఏ లు విధులు బహిష్కరించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 70 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న తరుణంలో విఆర్ ఏ లకు గత రెండు నెలలుగా జీతాలు లేక ఆర్థికంగా ఇబ్బందులతో కుటుంబ పోషణ భారముతో ఎంతో మంది విఆర్ ఏ లు ఆత్మహత్యలు చేసుకున్నారు.అది భావించిన డోర్నకల్ విఆర్ ఏ జేఏసీ నాయకులు రైతులు, రైతు సంఘాలు, ప్రజలు, మరియు ఉపాధ్యాయ సంఘాలు, కుల సంఘాలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, వీఆర్ఏల నిరవధిక సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపి కొంత ఆర్థిక సహాయం ద్వారా మరియు భిక్షాటన చేయడం ద్వారా వచ్చిన డబ్బులతో డోర్నకల్ మండలంలోని 32 మంది వీఆర్ఏలకు ప్రతి ఒక్కరికి బియ్యం మరియు నిత్యవసర కిరాణా సరుకులు పంపిణీ చేసుకున్నారు. హామీలను (మాటను) అమలుపరిచి విఆర్ ఏ లు కుటుంబ సభ్యులతో సంతోషంగా దసరా పండుగ జరుపుకొని కొత్త ఉత్సాహంతో విధులు నిర్వహించే విధంగా చేసుకున్నామని డోర్నకల్ విఆర్ ఏ జేఏసీ కన్వీనర్ బాలకృష్ణ తెలిపారు.ఈ కార్యక్రమంలో విఆర్ ఏ లందరూ పాల్గొన్నారు.