ఆల్ఫోర్స్‌లో విద్యార్థిని ఆత్మహత్య

కరీంనగర్‌: జిల్లా కేంద్రంలోని భగత్‌ నగర్‌లోగల  ఆల్ఫోర్స్‌ బాలికల జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న  మూల వినిత(17)   ఉరివేసుకోని  ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది.  కొడిమ్యాల మండలం రామకృష్టపూర్‌ గ్రామాన్నికి చెందిన విద్యార్థిని అని పోలీసులు తెలిపారు. ఉరివేసుకున్నా స్థలంలో సునైట్‌ నోట్‌ ఉన్నట్లుగా  గుర్తించారు.