ఆసరా ఫించన్లు మానవీయ పాలనకు నిదర్శనం

దేశంలో 50 లక్షల ఫించన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

కేసీఆర్ నాయకత్వంలోనే ఇది సాధ్యమయింది

57 ఏండ్లకు వయసు కుదించి ఆసరా ఫించన్లను అందిస్తున్న మనసున్న మహరాజు కేసీఆర్

గతంలో 65 ఏండ్లు నిండిన వారికే ఫించను ఇచ్చేది .. అదీ గ్రామంలో ఎవరయినా చనిపోతే కొత్త వారికి ఫించను ఇచ్చేది

కేసీఆర్ మానవతా దృక్ఫధంతో 65 ఏళ్ల అర్హతను 57 ఏళ్లకు కుదించి ఫించన్లు అందిస్తున్నారు

ఏడెకరాల లోపు భూమి ఉండి, ప్రభుత్వ ఉద్యోగం లేని, నాలుగు చక్రాల వాహనాలు లేని కుటుంబాలకు ఆసరా ఫించన్లు

మామిడిమాడ, సల్కెలాపూర్, వెనికితండా, కర్నెతండా, ఆముదంబండ తండా, తిరుమలాయపల్లి గ్రామాల్లో 1031 మందికి ఆసరా ఫించన్లు

ఒక్క మామిడిమాడ గ్రామంలో 1079 మంది రైతులకు రైతుబంధు పథకం కింద రూ.8.29 కోట్లు వారి ఖాతాలలో జమచేయడం జరిగింది

రాష్ట్రంలో కోటి 46 లక్షల ఎకరాలలో పంటలు సాగవుతున్నాయి

24 గంటల ఉచిత కరంటుతో రైతాంగానికి ఊరట

రైతుభీమా పథకంతో వ్యవసాయాన్ని నమ్ముకున్న కుటుంబాలకు అండ

కోటి దేవుళ్లకు మొక్కినా
ఒక్క అన్నదాతకు సేవ చేసుకున్నా ఒక్కటే

భూమిలేని వారిలో అత్యధికులు దళితులు .. వారి కోసమే దళితబంధు .. విడతలవారీగా అందరికీ దళితబంధు

ఆకలైన కడుపుకు అన్నం పెట్టాలి .. చేసే చేతికి పని కల్పించాలి అన్నది ప్రభుత్వ లక్ష్యం

రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందించే రంగాలకు ప్రణాళికాబద్ధంగా చేయూత అందించడంతో ఎనిమిదేళ్లలో తెలంగాణ రూపురేఖలు మారాయి

ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బులు విద్య, వైద్యం కోసం పోగొట్టుకోకూడదనే ఉద్దేశంతో రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలను మెరుగుపరచడం జరుగుతున్నది

ముఖ్యమంత్రి కేసీఆర్ గురుకుల పాఠశాలల సంఖ్యను వెయ్యికి పెంచారు .. ప్రతి విద్యార్థిపై రూ.లక్ష 25 వేలు ఖర్చు చేయడం జరుగుతున్నది

మన ఊరు మనబడి పథకం కింద రాష్ట్రంలోని పాఠశాలలో మౌళిక వసతులు కల్పించడం జరుగుతున్నది

వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు గ్రామీణ వైద్యశాలలు ఏర్పాటు చేయడం జరిగింది

వనపర్తి జిల్లా కేంద్రంలో 600 పడకల ఆసుపత్రి అందుబాటులోకి రానున్నది

ఆడబిడ్డలకు కాన్పులు చేసి 16 రకాల వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్, ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలు ఇస్తున్నారు

సర్కారు వైద్యం బలోపేతం చేస్తే ప్రజలు ప్రైవేటుకు వెళ్లరని తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగం మీద దృష్టిపెట్టింది

బతుకమ్మ చీరలు ఆత్మగౌరవ ప్రతీకలు

ఆడబిడ్డకు సారెగా చీరపెట్టడం తన పుట్టినిల్లు సల్లగుండాలి ఆశీర్వాదం అందుకోవడం

ఆడబిడ్డల ఆశీర్వాదం తెలంగాణ ప్రభుత్వానికి ఉండాలి

ఖిల్లాఘణపురం మండలం మామిడిమాడలో మామిడిమాడ, సల్కెలాపూర్, వెనికితండా, కర్నెతండా, ఆముదంబండ తండా, గ్రామాల లబ్దిదారులకు, అల్లమాయిపల్లి గ్రామంలో అల్లమాయిపల్లి, మల్క్ మియాన్ పల్లి, ఈర్ల తండా, రోడ్ మీది తండా, తిరుమలాయపల్లి గ్రామాల లబ్దిదారులకు, కమాలుద్దీన్ పూర్ లో కమాలుద్దీన్ పూర్ , అంతాయిపల్లి, ఆగారం, మహ్మద్ హుస్సేన్ పల్లి గ్రామాల లబ్దిదారులకు నూతన ఆసరా ఫించను గుర్తింపు కార్డులు, బతుకమ్మ చీరలు అందజేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి