ఆసర పెన్షన్ కార్డులు,బతుకమ్మ చీరలు పంపిణీ

స్టేషన్ ఘనపూర్, (చిల్పూర్), సెప్టెంబర్ 25, ( జనం సాక్షి ) : చిల్పుర్ మండలంలోని చిన్నపెం డ్యాల గ్రామంలో సర్పంచుల ఫోరం మండలఅధ్య క్షుడు మామిడాల లింగారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆసర పెన్షన్ కార్డులు, బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ కార్యక్ర మనికి ముఖ్య అతిథిగా తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ‌జిల్లా పరిషత్ చైర్మన్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి హాజరై లబ్ది దారులకు ఆసర పించను కార్డులు, బతుకమ్మ చీరలు పంపిణీ చేసారు.ముందుగాచాకలిఐలమ్మ జయంతి సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణ లో ఏర్పాటు చేసిన ఐలమ్మ  చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఆడబిడ్డలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్నగా బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మచీరలుకానుకగా అందిస్తున్నారనిఅన్నా రు. టిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని మతాలను గౌరవి స్తుందనీ తెలంగాణరాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తున్న కేసీఆర్ కి రుణపడి ఉండాలని అన్నారు. ఏ రాష్ట్రంలో లేని అభివృద్ది మనరాష్ట్రంలో జరు గుతుంది అని,ప్రతి పేద కుటుంబం సుఖసంతోషా లతో ఉండాలన్నదే సీఎం ఆశయమని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రం లో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత కెసిఆర్ కే దక్కిందన్నారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు.ఈసమా వేశంలో ఎంపిపి సరిత , సర్పంచ్ లింగారెడ్డి,ఎంపి టీసి ఉమా సమ్మయ్య, మండల అధ్యక్షుడు రమే ష్ నాయక్, టిఆర్ఎస్ మండల సమన్వయ కర్త పోలెపల్లి రంజిత్ రెడ్డి,పిఏసిఎస్ వైస్ చైర్మన్ నాగ రాజు,వెంకటస్వామి,నియోజకవర్గ సోషల్ మీడి యా ఇంచార్జ్ రంగు రమేష్, మార్కెట్ డైరెక్టర్లు రాజన్ బాబు, రంగు హరీష్, అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, మహిళలు, తదితరు లు పాల్గొన్నారు.