ఆసుపత్రి సిబ్బందిపై దాడి
కరీంనగర్: హుజూరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమే మృతికి కారణమంటూ బంధువులు ఆసుపత్రి సిబ్బందిపై దాడికి దిగారు. ఆసుపత్రిలోని ఫర్నీచర్‌ను ధ్వసం చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో బంధువులు శాంతించారు.