ఆస్పత్రుల్లో పస్రసవాలు పెరగుతున్నాయి
కరీంనగర్,నవంబర్6(జనంసాక్షి): కేసీఆర్ కిట్లను ప్రారంభించిన నాటి నుంచి ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు రెట్టింపయ్యాయని ప్రభుత్వ దవాఖాన నోడల్ ఆఫీసర్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుహాసిని ప్కేన్నారు. ప్రసవాలు రెట్టింపు కావడంతోపాటు సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు. దవాఖానాల్లో వైద్యులతోపాటు వైద్యసిబ్బంది కొరత లేదని పేర్కొన్నారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో డిసెంబర్‌లో వెయ్యి ప్రసవాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం మాతా శిశు సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నదని చెప్పారు. పని భారం అధికమవుతున్నా సిబ్బంది పనిచేయడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలోనే ఈ దవాఖానలో ప్రసవాల సంఖ్య ఎక్కువగా ఉందని తెలిపారు. త్వరలోనే డయాలసిస్, వెల్‌నెస్ సెంటర్లు అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. వెంటిలేటర్లు లేకపోవడంతో ఇప్పటిదాకా వరంగల్‌కు రోగులను రెఫర్ చేస్తున్నామనీ, కానీ ప్రస్తుతం ప్రభుత్వం నాలుగు వెంటిలేటర్లను మంజూరు చేసిందన్నారు. ఇప్పటి నుంచి రోగులను రెఫర్ చేయాల్సిన అవసరం ఉండదని ఆమె పేర్కొన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఇక్కడ డీఎన్‌బీ, మిడ్ వైఫరీ కోర్సులు ప్రారంభించడంతో వైద్య సేవలు మరింత మెరుగయ్యే అవకాశముందన్నారు. ప్రస్తుతం దవాఖానలో పూర్తిస్థాయిలో మందులు, వైద్యులు, వైద్యసిబ్బంది ఉన్నారని ఆమె తెలిపారు. అలాగే, ప్రతిమా డీన్ వివేకానంద సహాయంతో వైద్యులు ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఎంసీహెచ్ భవనంలో వివరాలన్నింటినీ పూర్తిగా కంప్యూటరైజ్డ్ చేశామనీ, పేషెంట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకొని, సమయం వృథా కాకుండా నేరుగా దవాఖానాకు వచ్చే వీలుంటుందన్నారు. ఒకేసారి ఏడుగురు ప్రసవం అయ్యేలా ఏసీ గదులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.