ఇంటింటా జాతీయ పతాకాన్ని ఎగిరేద్దాం -స్వాతంత్ర భారత కీర్తిని దశదిశల చాటుదాం
చైతన్యపురి డివిజన్ తెరాస నాయకులు చంద్రశేఖర్ రెడ్డి
.ఎల్బీ నగర్ (జనం సాక్షి ) 75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రివర్యులు కెసిఆర్ గారు నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా జాతీయ జెండాలు ఇంటింటికి పంపిణి చేయాలని ఎల్ బి నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు చైతన్యపురి డివిజన్ తెరాస నాయకులు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్ లోని న్యూ ఇందిరానగర్, అంబేద్కర్ నగర్ కాలనీలలో ఇంటింటికెళ్లి జాతీయ జెండాలు పంపిణి చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు కృష్ణ, జలంధర్, సంతోష్ యాదవ్, పులి కిరణ్,విజయ్, రమేష్, నరేష్,శంకర్, రాజు, శ్రీకాంత్, నవీన్ తదితరులు పాల్గొనడం జరిగింది..
