ఇంటింట జాతీయ జెండా పంపిణీ

 

డోర్నకల్ ఆగస్టు 8 (జనం సాక్షి)

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పురపాలక చైర్మన్ వాంకుడోత్ వీరన్న,వైస్ చైర్మన్ కేశబోయిన కోటిలింగం నేతృత్వంలో,మండల వ్యాప్తంగా ఎంపీపీ బాలు నాయక్,జడ్పిటిసి కమల రామనాథం,సర్పంచుల ఆధ్వర్యంలో జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది.మండలంలోని బొడ్రాయి తండా,తెల్ల బండ తండా గ్రామాల్లో సర్పంచులు గామ్మి రాజు,గుగులోత్ శ్రీను నాయక్ ఆధ్వర్యంలో ఇంటింటికీ జాతీయ జెండాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ… స్వతంత్ర సిద్ధించి 75 సంవత్సరాలు పురస్కరించుకుంటున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు,అధికారుల సూచనల మేరకు గ్రామంలోని ప్రతి ఇంటికి జాతీయ జెండాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.వార్డు సభ్యులు, కార్యదర్శు,జీపీ సిబ్బంది ఆధ్వర్యంలో జెండాల పంపిణీ 14వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు.
నిబంధనలు పాటిస్తూ 15న ఇంటింటా జాతీయ పతకాలను ఆవిష్కరించాలని కోరారు.జెండా ఆవిష్కరించే అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.తద్వారా గ్రామంలో ప్రతి పౌరుడు దేశభక్తిని పెంపొందించుకోవాలని కోరారు.కార్యక్రమంలో ఎంపీడీవో అపర్ణ,కమిషనర్ శ్రీనివాస్,ఎంపీఓ మున్వర్,కౌన్సిలర్లు,వార్డు సభ్యులు కార్యదర్శులు,
అంగన్వాడి,ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.