ఇంటూరి శేఖర్ పైన వచ్చిన ఆరోపణలను ముక్త కంఠంతో ఖండించిన మండల సర్పంచులు
కూసుమంచి ఆగస్టు 14 ( జనం సాక్షి ) : గత మూడు రోజులుగా డిసిసిబి డైరెక్టర్ ఇంటూరు శేఖర్ పై వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా మరియు వివిధ పత్రికల ద్వారా (జనం సాక్షి కాదు ) వైరల్ అవుతున్న వార్తలను ఆదివారం రోజున ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు మండలానికి సంబంధించిన పలు గ్రామపంచాయతీల సర్పంచులు పత్రికా సమావేశం నిర్వహించి శేఖర్ పై వస్తున్న అసత్య ఆరోపణలను తప్పుడు ఆడియోలను ముక్తకంఠంతో ఖండించారు.
నాయకన్ గూడెం సర్పంచ్ (కూసుమంచి మండల సర్పంచ్ ల సంఘం మాజీ అధ్యక్షుడు) కాసాని సైదులు మాట్లాడుతూ 2019 నుండి ఎన్నికైన మేము ఈరోజు వరకు గ్రామపంచాయతీలలో వైకుంఠధామం, డంపింగ్ యార్డ్, పల్లె ప్రగతి, పల్లె ప్రకృతి వనం, పల్లె క్రీడా ప్రాంగణం, ప్రతి సంవత్సరం నిర్వహించే హరితహారం, ఇలా అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటూ పంచాయతీలను అభివృద్ధి పదంలో నడిపిస్తున్న మాకు ఆర్టిఐ పేరుతో వేధింపులకు గురి చేయడం సరికాదని గతంలో నాయకన్ గూడెం గ్రామ పంచాయతీకి సంబంధించి తోళ్ల గోపి, అల్లుట్ల సైదులు అనువారు ఆర్టిఐ వేధింపులకు గురి చేశారని ఆయన ప్రస్తావించారు. అంతేకాకుండా కులాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది వసూళ్లకు పాల్పడుతున్నారని ఇది సరైన పద్ధతి కాదని ఇది కేవలం సర్పంచ్ లను ఇబ్బంది పెట్టే విషయంగా భావించాల్సి ఉంటుంది అని ఆయన అన్నారు ఆర్టిఐ వేసేవాళ్ళు ఎన్నిసార్లు సమాచారం అడిగిన ఇవ్వటానికి ప్రభుత్వ అధికారులు ఉన్నారు కానీ డబ్బుల వసూళ్లకు పాల్పడివద్దని ఇది ఆర్టిఐ చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయవద్దని ఆయన వారికి విజ్ఞప్తి చేశారు. ఇంటూరి శేఖర్ అందరితో కలుగల్పుగా ఉండే మనిషి అలాంటి వ్యక్తిపై ఇలాంటి దుష్ప్రచారం తగదని ఇది కేవలం ఆయన వ్యక్తిగత ఇమేజ్ ని పాడు చేయడం కోసం కొంతమంది పనిగట్టుకుని ఇలాంటి తప్పుడు రికార్డులను సృష్టించుకుని ఇబ్బంది పెడుతున్నారని దళితులతో బడుగు బలహీన వర్గాలతో సఖ్యతగా ఉండే ఇంటూరి శేఖర్ పై ఎలాంటి దుష్ప్రచారం జరిగిన ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.
కూసుమంచి మండలం సర్పంచ్ ప్రస్తుత మండల సర్పంచ్ ల అధ్యక్షుడు చెన్నా మోహన్ మాట్లాడుతూ సమాచారం తెలుసుకునే హక్కు ఉన్నప్పటికీ అది మితిమీరిన విధంగా ఉండకూడదని సర్పంచులమందరము మా ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఆదేశానుసారం వారి యొక్క అడుగుజాడల్లో కేవలం ప్రజాసేవ చేయడానికి వచ్చామని కానీ కొంతమంది ఆర్టిఐ పేరుతో బ్లాక్ మెయిలింగ్ వసూళ్లకు పాల్పడుతున్నారని అటువంటి వారికి కొంతమంది వత్తాసు పలుకుతూ లేనిపోని తప్పుడు ప్రచారం చేస్తూ నిత్యం దళితులతో సఖ్యతగా ఉండే ఇంటూరి శేఖర్ పై అసత్య ఆరోపణలు చేస్తూ ఆయన యొక్క మంచితనానికి దెబ్బ కొట్టాలని చూస్తున్నారని దున్నపోతుల సురేష్ ని అడ్డం పెట్టుకొని కొంతమంది రాజకీయంగా శేఖర్ ని దెబ్బకొట్టాలని ఉద్దేశంతో ఆయనపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆయన ఏ ఎన్నికల్లో పోటీ చేసినా సరే ప్రజలు ఆయనను ఆదరించి గెలిపిస్తున్నారని అలాంటి వ్యక్తిపై బురదజల్లే కార్యక్రమం పెట్టుకొని ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అలాంటి వారికి ప్రజలే గుణపాఠం చెప్తారని నిజంగా ఆర్ టి ఐ వేస్తే పంచాయతీ సెక్రటరీల సమాధానం చెబుతారు తప్పితే సర్పంచ్ లకు ఎలాంటి బాధ్యత ఉండదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఆర్టిఐ వేసి సర్పంచుల ఫోన్ నెంబర్లు తీసుకొని వారికి ఫోన్ చేయవలసిన అవసరం లేదని ఆర్టిఐ వేసే వారికి ఆయన సూచన చేశారు. మండలంలోని ఏ సర్పంచ్ అయినా అవినీతి పనులు చేసినట్లు నిరూపిస్తే మాయావదాస్తిని రాసిచ్చి ఈ మండలం నుంచి వెళ్ళిపోతామని ఆయన ఆర్టిఐ వేసే వాళ్లకు సవాల్ విసిరారు. జీళ్ళ చెరువు సర్పంచ్ కొండా సత్యం మాట్లాడుతూ గత ఆరు నెలలుగా ముదిగొండ మండలం ఎడవల్లి గ్రామస్తుడు దున్నపోతుల సురేష్ నన్ను ఆర్టిఐ పేరుతో వేధిస్తున్నాడని డబ్బులు అడుగుతే ఇవ్వనందునే ఇలాంటి తప్పుడు ఆడియోలు సృష్టించి మా నాయకుడు ఇంటూరి శేఖర్ ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడని కేవలం ఇది శేఖర్ ని రాజకీయంగా ఎదుర్కోలేక సురేష్ ని అడ్డం పెట్టుకొని కొంతమంది తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని వారికి రాబోయే కాలంలో తగిన గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల తెరాస అధ్యక్ష, కార్యదర్శులు వేముల వీరన్న, ఆసిఫ్ పాషా, ఎస్టీ సెల్ అధ్యక్షులు కోటి యాదవ్, తంగెళ్ల బుచ్చిబాబు, మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన సర్పంచులు, మండల పరిషత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.