ఇంద్రజాల కళాకారులు సాధనా శూరులు

మోత్కూరు అక్టోబర్ 23 జనంసాక్షి : మోత్కూరు పట్టణ పద్మశాలీలు సంఘం నిర్వహించిన సాధనా శూరుల ఇంద్రజాల ప్రదర్శనను పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో నిర్వహించారు. పట్టణ పద్మశాలి సంఘం నాయకులు మాట్లాడుతూ సాధనా శూరులు అంటేనే పద్మశాలి లో ఒక వర్గం. వీరందరూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వీణవంక మండలం వాసులు,వీరు నాలుగోవ తరం 6 ప్రదర్శన బృందాలుగా ఉన్నాయన్నారు. పూర్వతరం నుంచి వారసత్వంగా ఇంద్రజాల విద్యలు నేర్చుకొని,ఆ విద్యనే వృత్తిగా స్వీకరించి పద్మశాలీలను ఆశ్రయించి ప్రదర్శిస్తుంటారు.ఒకే కులానాశ్రయించి ప్రదర్శించే కళారూపాల్లో సాధన శూరులు ఒకరు. తరతరాలుగా ఆనవాయితీగా వస్తున్న రాష్ట్రంలోని పద్మశాలీల ఒప్పందంతో గ్రామ గ్రామాన సంచరిస్తూ విశాలమైన కూడలిలో ప్రదర్శిస్తుంటారు. ఎటువంటి ఆదరణ లేని సాధనా శూరులకు తెలంగాణ ప్రభుత్వం నుండి పింఛన్ ఇవ్వాలని కోరుతున్నామన్నారు.