ఇకనుంచైనా శాంతి కొనసాగిద్దాం

2

-భారత్‌, చైనా మధ్య ఒప్పందం

దిల్లీ, బీజింగ్‌ మార్చి 24 (జనంసాక్షి):

సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని కొనసాగించే దిశగా భారత్‌, చెయనాలు అంగీకారం కుదుర్చుకున్నాయి. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతో పాటు ఉగ్రవాదంపై పోరాటం, సముద్ర జలాల పరిరక్షణ, పౌర అణు శక్తి రంగాల్లో ఈ నిర్ణయం ఎంతో అవసరమని పేర్కొన్నాయి. రెండు దేశాల ప్రత్యేక ప్రతినిధులు సరిహద్దు అంశాలపై… సోమ, మంగళవారాల్లో 18వ దశ చర్చలు దిల్లీలో జరిపారు. భారత్‌ తరఫÛన జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, చెయనా తరఫÛన స్టేట్‌ కౌన్సిలర్‌ యాంగ్‌ జిుౖచి ఈ చర్చల్లో పాల్గొన్నారు. సుహృద్భావ వాతావరణంలో, నిర్మాణాత్మకంగా ఈ చర్చలు కొనసాగినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. రాజకీయ ప్రమాణాలు, మార్గదర్శక సూత్రాలను అనుసరించి… సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడానికి పరస్పర అంగీకార ప్రణాళికను తయారుచేసుకునే దిశగా వారు చర్చించినట్లు వివరించింది. రెండు దేశాల సరిహద్దు బలగాల మధ్య సంబంధాలు మరింత పెంచుకునే దిశగా చర్యలు చేపట్టడానికి వారు సమ్మతించారని వివరించింది. వాతావరణ మార్పులు, ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు, పౌర అణుశక్తి సహకారంతో పాటు పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలను ఈ సందర్భంగా వారు చర్చించినట్లు తెలిపింది. చెయనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌… భారత పర్యటన అనంతరం నెలకొన్న ఉత్సాహపూరిత వాతావరణంలో… రైల్వేలు, స్మార్ట్‌సిటీలు, వృత్తి విద్య, నైపుణ్య అభివృద్ధి, శుద్ధ, పునరుద్ధరణ ఇంధనాలు, తయారీ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తృతపర్చుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొంది. సిస్టర్‌-సిటీ, సిస్టర్‌-ప్రొవిన్స్‌ యంత్రాంగం ద్వారా భారత్‌, చెయనా రాష్గాల మధ్య పెరుగుతున్న బంధాలు… రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంలో కీలక పాత్ర పోషిస్తాయని వారు అంగీకరించినట్లు తెలిపింది. సమావేశాల అనంతరం ప్రధాని మోదీకి ఫోన్‌ చేసిన యాంగ్‌… చెయనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌, ప్రధాని లీ కెకియాంగ్‌ల తరఫÛన ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.