ఇకపై ధోనీ పరిమళాలు

దుబాయ్‌ ,జనవరి 29 :ప్రపంచ మార్కెట్‌లో ఇకపై ధోనీ పరిమళాలు వెదజల్లనున్నాయి. ఎందుకంటే టీమిండియా కెప్టెన్‌ తన పేరుతో పెర్ఫ్యూమ్స్‌ విడుదల చేయబోతున్నాడు. తద్వారా సొంత పేరుతో సుగంధపరిమళాల ఉత్పత్తి ఉన్న ఎ లిస్ట్‌ సెలబ్రిటీల జాబితాలో చేరబోతున్నాడు. వరల్డ్‌ స్పోర్ట్స్‌ స్టార్స్‌ రోజర్‌ ఫెదరర్‌ , డేవిడ్‌ బెక్‌హామ్‌ బాటలోనే భారత జట్టు సారథి మహేంద్రసింగ్‌ ధోనీ కూ డా నడుస్తున్నాడు. తన పేరుతో ఉన్న పె ర్ఫ్యూమ్‌ను ధోనీ రేపు దుబాయ్‌లో విడుదల చేయనున్నాడు. బ్యూటీ కాంటాక్ట్‌ పేరుతో ఇప్పటికే ఒక కంపెనీ పెట్టిన మహేంద్రుని దానికి మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ఈ మార్గం ఎంచుకున్నట్టు తెలుస్తోంది.