ఇక డ్రామాలు ఆపండి

జనం తరమి కొడతారు
కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌
హైదరాబాద్‌, జూన్‌ 30 (జనంసాక్షి) :
ఇంతకాలం తోకముడిచిన కాంగ్రెస్‌ నేతల్లో కదలిక వ చ్చిందెందుకంటే కేవలం గ్రామాల్లోకి రాకుండా టీ జేఏ సీ పిలుపునివ్వడమే కారణ మని, అందుకే తెలంగాణ కాంగ్రెస్‌ డ్రామాలు ఆడుతోం దని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీి ఆర్‌ ఆరోపించారు. తెలం గాణ భవన్‌లో నగరానికి చెందిన పలు పార్టీల నాయ కులు టీిఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో
ఆయన మాట్లాడారు. నిన్నమొన్నటి వరకు తెచ్చేది మేమే ఇచ్చేదిమేమే అన్ననేతలు ఎందుకు తీసుకురాలేదో చెప్పే పరిస్థితిలో లేరన్నారు. జాతీయ పార్టీలతోనే తెలంగాణ సాధ్యం అంటున్న పార్టీలు వారికున్న సత్తా ఏమిటో చెప్పాలన్నారు. దేశంలో 28 రాష్ట్రాల్లో గెలిచే సత్తా ఉందాని నిలదీశారు. పార్లమెంట్‌ సభ్యుల్లో సగానికి సగం 272 సీట్లు సాధించే సత్తా ఆ పార్టీలకుందా అని ప్రశ్నించారు. దేశంలో అలాంటి పరిస్థితి లేనప్పుడు జాతీయ పార్టీలు ఎలా అవుతాయని కాంగ్రెస్‌, బీజేపీపై మండిపడ్డారు. కాస్తా పెద్దసైజు ప్రాంతీయ పార్టీలే అవి అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న కాంగ్రెస్‌ మీటింగ్‌కు కథ, స్క్రీన్‌ ప్లే, డైరెక్షన్‌ అంతా కేంద్రమేనన్నారు. తెలంగాణ ప్రజలను మరో సారి మోసం చేసేందుకే ఈ సమావేశం పెడుతున్నారన్నారు. సమావేశం పెట్టి ఏం సాధిస్తారనేదానికి వారి వద్ద సరైన సమాధానంకూడా లేదన్నారు. అమ్మగారికి మరోసారి దండం పెట్టి గుర్తుచేసేందుకేనని సభను చూస్తున్న షబ్బీర్‌అలీ అంటున్నాడంటే ఇంతకంటే దద్దమ్మలు ఇంకెవరైనా ఉంటారా అని ప్రశ్నించారు. తేపకోసారి ఉదయం ఓనాయకుడి ఇంట్లో, మధ్యాహ్నం మరోనాయకుడిరట్లో, రాత్రికి ఇంకో నాయకుడిరట్లో కూర్చుని బ్రేక్‌ఫాస్ట్‌లు, బిర్యానీలు, పుల్కాలుతింటూ కాలయా పన చేస్తూవచ్చారని ఆరోపించారు. ఉదయం, మధ్యహ్నం, సాయంత్రం ప్రతిసారి బొంగులముందుకు వచ్చి ఇరగతీస్తాం, అరగతీస్తాం, అంగీలు చింపుకుంటాం అంటూ ప్రగల్బాలు పలుకుతూ వచ్చారన్నారు. ఇప్పటివరకు వారు చేసిన త్యాగాలేవీ లేవన్నారు. ఇప్పటి కైనా చిత్తశుద్దిఉంటే ఢల్లీికి వెళ్లి సోనీయాగాంధీ ఇంటి ముందు ధర్నాకు దిగితే తప్పకుండా తెలంగాణా వచ్చి తీరుతుందన్నారు. సమస్యలను చెప్పుకునేందుకు విూవద్దకు వస్తామని హైదరాబాద్‌కు వస్తామన్న తెలంగాణ ప్రజలను అడ్డుకున్న దద్దమ్మ ప్రభుత్వం కిరణ్‌ది కాంగ్రెస్‌దేనన్నారు. ఇంతకాలం కుంభకర్ణుడిగా నిద్రపోయిన తెలం గాణా కాంగ్రెస్‌ నేతలు మత్తు వదిలించుకుని బహిరంగ సభ నిర్వహించి పంచాయితీ ఎన్నికల్లో గ్రామాల్లోకి పోయేందుకు వేస్తున్న ఎత్తుగడలేనని కేటి ఆర్‌ దుయ్యబట్టారు. ఇప్పటికి తెలంగాణాలో ప్రజలు ఆపార్టీని నమ్మే పరిస్థితి లేకపోవడం, టీ జేఏసీ గ్రామాల్లోకి రాకుండా అడ్డుకుంటామని హెచ్చరికలు పెట్టడంతోనే నేతల్లో కదలిక వచ్చిందన్నారు. అంతే తప్ప తెలంగాణా రాష్ట్రం తేవాలన్న చిత్తశుద్ధి లేనే లేదన్నారు. స్వీయ రాజకీయ శక్తిగా ఎదిగి కేంద్రాన్ని శాసించి రాష్ట్రం తెచ్చుకోవాలన్నదే టీఆర్‌ఎస్‌ అభిమతమన్నారు. ఒక్కఓటు రెండు రాష్ట్రాలన్న బీజేపీ ఎందుకు వెనక్కి తగ్గిందని ప్రశ్నిస్తే చంద్రబాబు అడ్డుకున్నారని పేర్కొనడం హాస్యాస్పదం అన్నారు. జాతీయ పార్టీలకు ఓ అభిప్రాయం ఉండదా అన్నారు. మరోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక వెంకయ్యనాయుడో, గోపయ్యో వ్యతిరేకిస్తే తెలంగాణా ఇవ్వలేక పోయామని చెప్పే ప్రమాదం ఉందన్నారు. ఇస్తానన్న కాంగ్రెస్‌ 9ఏళ్లుగా ఇవ్వనేలేదు, ఇచ్చే అధికారం ఉన్నప్పుడు ఇవ్వకుండా తుంగలో తొక్కిన బిజెపిలను తెలంగాణా ప్రజలు ఎంత మాత్రం నమ్మరన్నారు. ఈపరిస్థితులను గమనించే నేడు టీఆర్‌ఎస్‌లోకి భారీగా  వలసలు పెరుగుతన్నాయన్నారు. కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు దళిత ఎంపీలు, సీనియర్‌ నేత కలిసి సోనియాగాంధీకి లేఖ రాస్తే కనీసం పట్టించుకున్న పాపాన కూడా పోలేదన్నారు. అదే సీమాంధ్రకు చెందిన కావూరి సాంబశివరావు రాజీనామా చేస్తానని బెదిరించగానే ప్రధానమంత్రి, సోనియా, రాహుల్‌గాంధీ పిలుచుకుని మరీ మాట్లాడి ఒప్పించడమేకాక, నేడు కేంద్ర మంత్రి పదవినిచ్చి పంపారన్నారు. ఇదీ తెలంగాణా నేతలకు కాంగ్రెస్‌ అధిష్టానం ఇచ్చే గౌరవం అన్నారు. ప్రజలను మభ్యపెట్టడం తప్ప ఆరెండు పార్టీల వల్ల వచ్చేది లేదు సచ్చేది లేదన్నారు. సనత్‌నగర్‌కు చెందిన అంజయ్యతోపాటు పలువురు కాంగ్రెస్‌, టిడిపి నేతలు టీిఆర్‌ఎస్‌లో చేరగా కేటీిఆర్‌ వారికి కండువా కప్పి ఆహ్వానించారు.