ఇజ్రయోల్ పాలస్తీనా చర్చించుకోవాలి
– ప్రపంచశాంతికి పాటుపడుదాం
– దేవుడితోపాటు శాంతి పుట్టింది
– పోప్ పిలుపు
రోమ్,డిసెంబర్25 (జనంసాక్షి): పవిత్ర భూమితో పాటు ప్రపంచమంతటా శాంతి నెలకొనాలని పోప్ ఫ్రాన్సిస్ తన క్రిస్మస్ సందేశంలో పేర్కొన్నారు. దేవుడు పుట్టిన చోటే శాంతి కూడా పుట్టిందని, శాంతి పుట్టిన చోట ఇక విద్వేషాలకు, యుద్ధానికి చోటులేదని ఆయన తెలిపారు. అయినా ఈ ప్రపంచంలో మాత్రం ఉద్రిక్తతలు, హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయని, అందువల్ల శాంతిని నెలకొల్పాలని అన్నారు. రోమ్ నగరంతో పాటు ప్రపంచం అంతటికీ క్రిస్మస్ సందర్భంగా ప్రతి యేటా పోప్ తన సందేశాన్ని అందిస్తుంటారు. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా సెయింట్ పీటర్స్ స్క్వేర్ వద్దకు భారీ సంఖ్యలో హాజరైన భక్తులను ఉద్దేశించి పోప్ ఫ్రాన్సిస్ మాట్లాడారు. శాంతిని నెలకొల్పాలని చెప్పడమే కాక, దానికి మార్గాలను కూడా ఆయన సూచించారు. ఉదాహరణకు ఇజ్రాయెలీలు, పాలస్తీనా వాసులు ప్రత్యక్షంగా చర్చించుకోవాలని, రెండు దేశాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఘర్షణకు ఓ పరిష్కారాన్ని కనుగొనాలని అన్నారు. దీనివల్ల ఇరు దేశాల ప్రజలు సుహృద్భావంతో కలిసి జీవించే అవకాశం ఉంటుందని తెలి
పారు.