ఇసుక అక్రమలకు చెక్‌ పడేదెలా?

కరీంనగర్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి):ఇసుక అక్రమ తరలింపుకారణంగా భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. ఇసుకను అధికారుల కళ్లు గప్పి తరలిస్తున్నారు. అప్పటికే కొన్ని గ్రామాల్లో మధ్య దళారులు పోలిసులకు, రెవెన్యూ అధికారులకు అప్పగిస్తామని ట్రాక్టర్‌ యజమానుల నుంచి దర్జాగా డబ్బులను తీసుకుంటున్నారు. అధిక డబ్బులకు కకుర్తిపడ్డ ట్రాక్టర్‌ యజమానులు ఫోన్‌ లో ఇసుక ట్రిప్పులు బుక్‌ చేసుకుని తరలిస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, పోలిసు, మైనింగ్‌ అధికారులు చొరవ తీసుకుని అక్రమ ఇసుక రవాణా అరికట్టాలని ప్రజలుపేర్కొంటున్నారు. వాటర్‌ షెడ్‌ పథకంలో అనేక కట్టడాలు నిర్మించినట్లు చూపి బిల్లులు పొందినట్లు గ్రామస్థులు ఆరోపించారు. రాతి కట్టడాలపై తిమ్మాపూర్‌ నాబార్డ్‌ వాటర్‌ షెడ్‌ కమిటీ నంబర్లు ఉండగా,అవే కట్టడాలపై నర్సింగాపూర్‌ గ్రామ వాటర్‌ షెడ్‌ నంబర్లు ఉన్నాయి. ఇకపోతే భూగర్భ జలాలు అడుగంటి తాగునీటి సమస్యలు ఉత్పన్న మవుతాయనే ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టినా ఫలితం కానరావడం లేదు. మధ్య దళారుల నుంచి వేలాది రూపాయలు చేతులు మారుతున్నాయి.

…………………………………