ఈజిప్టు అధ్యక్షుడికి వ్యతిరేకంగా

మిన్నంటిన నిరసనలు
కైరో, (జనంసాక్షి) :
ఈజిప్టు రాజధాని కైరోలోని తెహ్రీస్క్వైర్‌ మరోసారి ఆందోళనలతో దద్దరి ల్లింది. దేశాధ్యక్షుడు మహ్మద్‌ మోర్సీకి వ్యతిరేకంగా ఆందోళనకారులు తెహ్రీస్క్వైర్‌లో ఆదివారం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిం చారు. రాజధాని కైరోతో పాటు దేశవ్యాప్తంగా ముఖ్య నగరాలు పట్టణాల్లో అధ్యక్షుడికి వ్యతిరేకంగా జాతీయ జెండాలతో ఆందోళనలు నిర్వహించారు. అప్పటి ఈజిప్టు నియంత హోస్నీ ముబారక్‌ను పదవినుంచి దించడానికి తెహ్రీస్క్వై ర్‌ వేదికగా నిలిచింది. ఇప్పుడు అదే ప్రాంతం నుంచి అధ్యక్షుడు మొర్సీకి వ్యతిరేకంగా వేలాది మంది ఇస్లామి క్‌ నాయకులు ఆందోళనకు పూనుకున్నారు. దేశంలో ప్రజ్వరిల్లుతున్న హింసకు మొర్సీ విధానాలే కారణమని వారు ఆరోపించారు. నైలు నదీ తీర ప్రాంతంలో గల ఆలెగ్జాండ్రియా నగరంలో పోలీసు బలగాలు హింసాత్మక ఘటనలకు పూనుకొని పలువురిని హత్య చేయడాన్ని వారు నిరసించారు. దేశంలో నుంచి నాటో సేనలను ఉపసంహరించాలని, హింసకు పాల్పడుతున్న సైన్యం ఆటకట్టించాలని డిమాండ్‌ చేశారు. మొర్సీ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ దేశ పునర్నిర్మా ణానికి కఠిన చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు.