ఈ’డెన్’ ఎవరిదో
కోల్‌కతా చేరిన ఇరుజట్లు షముమ్మరంగా ప్రాక్టీస్ విరాట్‌కోహ్లీకి గాయం షకోల్‌కతా వన్డేకు డౌట్?
కోల్‌కత్తా, జనవరి 1: భారత్‌లో ఐదేళ్ళ తర్వాత ద్వైపాక్షిక సిరీస్ ఆడుతోన్న పాకిస్థాన్ రెండో వన్డేకు సిధ్ధమవుతోంది. చెన్నై మ్యాచ్ విజయంతో ఉత్సా హంతో ఉన్న ఆ జట్టు ఇప్పుడు సిరీస్‌పై కన్నేసిం ది. కోల్‌కత్తా వేదికగా గురువారం జరగనున్న మ్యాచ్‌లో గెలిచేందుకు వ్యూహాలు సిధ్ధం చేసుకుం టోంది. ప్రస్తుతం పాకిస్థాన్ ఫామ్‌తో పాటు గత రికార్డుల పరంగా ఈడెన్ గార్డెన్స్‌లో ఆ జట్టే ఫేవ రెట్‌గా భావిస్తున్నారు. గతంలో ఇక్కడ జరిగిన వన్డేల్లో పాక్‌కు మంచి రికార్డుంది. ఈడెన్‌లో మొ త్తం ఐదు వన్డేలు ఆడిన పాకిస్థాన్ నాలుగింటిలో గెలిచి… ఒకదానిలో మాత్రమే ఓడింది. గెలిచిన నాలుగింటిలో మూడు భారత్‌తో ఆడినవే. 1987 లో ఇక్కడ తొలి వన్డే ఆడిన ఆ జట్టు భారత్‌పై 2 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్లకు 238 పరుగులు చేయగా పాకి స్థాన్ మరో మూడు బంతులుండగా, 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రెండేళ్ళ తర్వాత 1989లో నెహ్రూ కప్ లీగ్ మ్యాచ్‌లో కూడా పాక్ నే విజయం వరించింది. అదే టోర్నీ ఫైనల్‌లో విండీస్‌తో తలపడిన పాకిస్థాన్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. మళ్ళీ తొమ్మిదేళ్ళ తర్వాత జరిగిన ఇండి పెండెన్స్‌కప్ ఫైనల్‌లో ఆ జట్టు శ్రీలంక చేతిలో పరాజయం పాలైంది. అయితే 2004లో జరిగిన బీసిసిఐ ప్లాటినమ్ జూబ్లీ మ్యాచ్‌లో భారత్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరోవైపు భారత ఓవరాల్ రికార్డును చూస్తే ఇక్కడ 18 మ్యాచ్‌లు ఆడి పదింటిలో విజయం సాధించింది. పాకిస్థాన్‌పై మాత్రం ఇక్కడ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. ఇదిలా ఉంటే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించడంతో భారత జట్టు తొలిసారి సచిన్ లేకుండానే బరిలోకి దిగుతోంది. ఈడెన్ గార్డెన్స్‌లో మాస్టర్‌కు తిరుగులేని రికార్డుంది. మొత్తం 13 మ్యాచ్‌లో సచిన్ 496 పరుగులు చేశాడు. టెండూల్కర్ చివరిసారిగా ఇక్కడ 2009లో ఆడాడు. మాస్టర్ లేని లోటు భర్తీ చేయడం కష్టమే అయినా కీలకమైన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఖచ్చితంగా గెలిచి తీరాలి. లేకుంటే సిరీస్ చేజారిపోవడం ఖాయం. దీనికి తోడు గత ఏడాది చేదు జ్ఞాపకాలను మరిచిపోవాలంటే ఈ మ్యాచ్ నుండే ధోనీసేన విజయాల బాట పట్టాల్సిందే. ఈ నేపథ్యంలో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోన్న పాకిస్థాన్‌ను టీమిండియా ఏమేరకు నిలువరిస్తుందో వేచి చూడాలి.
విరాట్ కోహ్లికి గాయం
భారత క్రికెట్ జట్టు యువ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి పాదానికి గాయమైంది. దీంతో ఈ నెల మూడో తేదీన జరగనున్న రెండో వన్డే మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్30వ తేదీన చెన్నయిలోని చెపాక్ స్టేడియంలో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్ చేస్తున్న సమయంలో కోహ్లీ జారి పడ్డాడు. దీంతో పాదానికి గాయమైంది. ఫలితంగా మైదానం వీడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత ఆస్పత్రికి తరలించి ఎంఆర్‌ఐ స్కాన్ తీసినప్పటికీ గాయం తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రెండో వన్డేకు కోహ్లాని దూరంగా ఉంచాలని జట్టు యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. అయితే, కోల్‌కతా వన్డేకు కోహ్లీ అందుబాటులో ఉంటాడా లేదా అనేది మాత్రం బుధవారం నిర్ణయిస్తామని జట్టు మేనేజ్‌మెంట్ వెల్లడించింది.
కోల్‌కతా చేరిన భారత్-పాక్ జట్లు
కోల్‌కతాలో జరగనున్న రెండో వన్డే కోసం భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్లు ఇక్కడకు చేరుకున్నాయి. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈ నెల మూడో తేదీన రెండో వన్డే మ్యాచ్ స్థానిక ఈడెన్‌గార్డెన్స్‌లో జరగనున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఇరు జట్లు సోమవారం సాయంత్రానికి చేరుకు న్నాయి. జనవరి ఒకటో తేదీన కొత్తసంవత్సరం సందర్భంగా నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అయితే న్యూఇయర్ సందర్భం గా బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ తరపున ఎలాం టి కార్యక్రమాలు నిర్వహించడంలేదని కార్యదర్శి తెలిపారు. ఇదిలా ఉండగా, గత ఆదివారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో పాకి స్థాన్ క్రికెట్ జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని వీరోచితంగా పోరాడి సెంచరీ చేసినప్పటికీ.. భారత జట్టు ఓటమిపాలైంది.