ఈనెల 18న ఐ ఎఫ్ టి యు జిల్లా నిర్మాణ జనరల్ బాడీని జయప్రదం చేయండి
-ఐ ఎఫ్ టి యు. జిల్లా అధ్యక్షులు డి ప్రసాద్
టేకులపల్లి , సెప్టెంబర్ 16( జనం సాక్షి ): భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్ టీ యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిర్మాణ జనరల్ బాడీ ఈ నెల 18న ఇల్లందులో ఐతావారి కాంప్లెక్స్ లో నిర్వహిస్తున్నట్లు ఐఎఫ్ టీ యు జిల్లా అధ్యక్షులు డి ప్రసాద్ తెలిపారు. శుక్రవారం తుమ్మల చెలక మార్కెట్ గిడ్డంగుల వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ జిల్లా జనరల్ బాడీకి సింగరేణి,మోటార్ ,మునిసిపల్ ,గ్రామపంచాయతీ, కేటీపీఎస్ ,కస్తూరిబా, ఆశ ,అంగన్వాడి , హమాలి, మిషన్ భగీరథ, భవన నిర్మాణ తదితర విభాగాల నుండి ఎన్నిక కాబడిన 250 మందితో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐఎఫ్ టీ యు జిల్లాలో బలమైన కార్మికొద్యమాలు నిర్మించిన ఘన చరిత్ర కలిగి ఉన్నదని సింగరేణి సంఘటిత, అసంఘటిత కార్మిక సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్వహించి కార్మికుల మన్ననలను పొందిందని అన్నారు. జిల్లాలో బలమైన కార్మిక సంఘగా అభివృద్ధి చెందిందని అన్నారు .జిల్లా వ్యాప్తంగా ఐఎఫ్టియు మెరుపుల లాంటి కార్యకర్తలను తయారు చేసిందని ,ఉద్యమ పదములో నిస్వార్థంగా ఉక్కు క్రమశిక్షణ కలిగిన నాయకత్వాన్ని తయారు చేసిందని అన్నారు. ఐ ఎఫ్ టి యు లో రెండు చీలికలుగా అనివార్యంగా ఏర్పడడం దురదృష్టకరమన్నారు. అయినా పూర్వ వైభవాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఐ ఎఫ్ టి యు భావిస్తుందని అన్నారు .కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బలమైన ఉద్యమాలు నిర్వహించాలనే సంకల్పంతో ఈ జనరల్ బాడీని నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ జనరల్ బాడికి ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సూర్యం హాజరై ప్రారంభ ఉపన్యాసం ఇస్తారని, అదేవిధంగా ఈ జనరల్ బాడీ లో ఇల్లందు మాజీ శాసనసభ్యులు గుమ్�