ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ములుగు జిల్లా కలెక్టర్

 జిల్లా కలెక్టర్ గౌరవ శ్రీ కృష్ణ ఆదిత్య వారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్యజిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో మరియు పర్యవేక్షణ సిబ్బందితో మరియు ఫార్మసిస్టులతో ఉదయము 10 గంటలకు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క టెలి కాన్ఫరెన్స్లో అత్యవసర సేవలు గూర్చి వైద్య సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొదటగా వైద్యాధికారి తో పాటుగా అందరూ వైద్య సిబ్బంది ప్రతి ఒక్కరూ తమ తమ హెడ్ క్వార్టర్స్ లో 24 గంటలు సేవలందించాలని అందుబాటులో ఉండాలని తెలిపారు. గర్భిణీ స్త్రీల గురించి మాట్లాడుతూ ఈ డి డి ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలను ప్రసవానికి దగ్గరలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలను వారి గ్రామం నుండి వారికి ఉన్నత సేవలు ఎక్కడ లభిస్తాయో అక్కడికి అది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కావచ్చు లేదా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కావచ్చు వెంటనే వారిని తరలించాలని అశ్రద్ధ చేయకూడదు అని ఆదేశించారు. తర్వాత ఏఎన్ఎం గాని ఆశా వర్కర్ గాని అందరూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆశా కార్యకర్తలు తమకు కేటాయించిన గృహాలను ప్రతిరోజు దర్శించాలని వారి యొక్క ఆరోగ్య స్థితి గతులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారికి కావలసిన వైద్య సహాయము ఏఎన్ఎం ద్వారా అందించాలని ఇంకా ఆపై వైద్య సహాయం అవసరమైనట్లయితే వారిని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలని కోరారు. తదుపరి పునరావాస కేంద్రాలైన వరద బాధితులు ఉన్నచోట మెడికల్ క్యాంపులు నిర్వహించాలని  వారికి కావలసిన వైద్య సహాయము అందించాలని తెలిపారు. వర్షాలకు వరదలకు గురైనటువంటి గ్రామాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా గ్రామాలలో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలోని ఫార్మసిస్టులందరితో మందుల నిలువలు గూర్చి తెలుసుకోవడం జరిగింది. అత్యవసర సమయంలో మందులు కావలసినవి అందుబాటులో ఉంచుకోవాలని ఏవైనా మందులు అవసరమైనచో సెంట్రల్ డ్రగ్స్తోర్స్ కి ఇండెంట్ పెట్టాలని వెంటనే తెప్పించుకోవాలని మందులు నిల్వలు ఎప్పటికప్పుడు సరిపోయేలా ఉంచుకోవాలని పాముకాటు తేలుకాటు మొదలగు ప్రమాదాలు గురి అయ్యే అవకాశాలు ఈ వరదల సమయంలో ఎక్కువగా ఉంటుందని, వాటికి సంబంధించిన మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.మరియు వర్షాకాలంలో ఎదురయ్యే వ్యాధులైన అతిసారా, కలరా ,రక్త విరేచనాలు పోలియో, కామెర్లు, టైఫాయిడ్ మొదలగు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ అప్పయ్య గారు ప్రజలకు తెలియజేశారు. కాచి చల్లార్చిన నీటినే త్రాగాలని  త్రాగునీటి వనరులు అన్నింటిని క్లోరినేషన్ తప్పకుండా చేయాలని  నీటి సరఫరా గొట్టాలు డ్రైనేజీ పైపులకు లీకేజీ లేకుండా చూడాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నిలువ ఆహార పదార్థాలు కుళ్ళిపోయిన పండ్లు తినకూడదని,  వేడి వేడి ఆహార పదార్థాలను మాత్రమే తినాలని బహిరంగ ప్రదేశంలలో మలమూత్ర విసర్జన చేయరాదని మరుగుదొడ్లను ఉపయోగించాలని ఎవరైతే అతీసార బారిన పడతారో వారు ఓఆర్ఎస్ ద్రావణాన్ని తీసుకోవాలని ఆహారం తీసుకునే ముందు మరియు మలవిసర్జన తర్వాత చేతులను సబ్బుతో తప్పకుండా శుభ్రపరచుకోవాలని ప్రజలకు తెలియజేశారు.