ఈ నెల 24 నుంచి అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాలు

– జిల్లా సంక్షేమ అధికారి ఎం సబిత…
హన్మకొండ బ్యూరో చీఫ్ 22 సెప్టెంబర్ జనంసాక్షి
           ఈ నెల 24 నుండి అక్టోబర్ ఒకటి వరకు అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి ఎం సబిత తెలియచేసారు,
తెలంగాణ రాష్ట్ర  దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ హైదరాబాద్  సంచాలకుల ఉత్తర్వుల ప్రకారం కార్యాచరణ ప్రణాళిక  ప్రకారం వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలియజేసారు.
ఈ వారోత్సవాలలో భాగంగా 24 రోజున  కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో  సాయంత్రం 4.00గం., అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవ  వేడుకలు ప్రారంభిస్తామని
25.09.2022                  రోజున సిడిపివో ల ఆధ్వర్యంలో వృద్ధాశ్రమాలలో  క్రీడ మరియు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తామని,                       26.09.2022  రోజున               జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో  జిల్లా స్థాయి సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు,         27.09.2022  రోజున                జిల్లా స్థాయివయోవృద్ధులు, కమిటీ సభ్యులు, ఇతర వయోవృద్ధుల సంస్థలతో                   ఆరోగ్యభివృద్ధి, అవసరాలు మరియు వయోవృద్ధులపై సమీక్ష సమావేశం                                               వయోవృద్ధుల చట్టం’ 2007 రూల్స్ 2011 పై సమావేశం
28.09.2022 రోజున      ప్రతి గ్రామ సర్పంచ్ లకు, అంగన్ వాడి సిబ్బందికి వయోవృద్ధుల హక్కులు                                        మరియు వారికి అందించే సేవలపై సిడిపివో ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు,
29.09.2022 రోజున        జిల్లాలోని అన్ని అంగన్ వాడి కేంద్రాలలో గ్రాండ్ పేరెంట్స్ డే – పిల్లలు,                                                             తల్లిదండ్రులు,తాతలు, నానమ్మలు, అమ్మమల సమక్షంలో సంబంధబాంధవ్యాలు                                  తెలుపుటకు కార్యక్రమాలు.
30.09.2022 రోజున         వయోవృద్ధుల హక్కులపై అవగహన కార్యక్ర జిల్లా స్థాయి వయోవృద్ధులు,                                                కమిటీ సభ్యులు, ఇతర వయోవృద్ధుల సంస్థల మరియు పాఠశాల విద్యార్ధులు                                      మరియు కళాశాల విద్యార్ధులతో వాక్ తాన్ కార్యక్రమం
01.10.2022 రోజున        అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకలు ఉదయం 10.30 గం.,లకు శ్                              జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన, జిల్లా వయోవృద్ధుల కమిటీ అధికారులు, జిల్లా                                            వయోవృద్ధుల సంఘాల సభ్యులు మరియు వయోవృద్ధులతో ఈ కార్యక్రమం                                              కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించడం జరుగుతుందని,
సంబంధిత సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వయో వృద్ధులు హాజరై వారోత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా సంక్షేమ అధికారి సబిత తెలిపారు.