ఉచిత వైద్య శిబిరానికి స్పందన
పెద్దపల్లి జనంసాక్షి : పెద్దపల్లి రైల్వేస్టేషన్ వద్ద శనివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. వైద్యులు వివిధ రకాల పరీక్షలను నిర్వహించారు. అనంతరం అవసరమున్నవారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వారం రోజులపాటు లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో వైద్యశిబిరాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ, కావేటి రాజగోపాల్, దూడం కనకయ్య, జైపాల్‌రెడ్డి, అజీజ్, దొమ్మటి కనకయ్యతోపాటు పలువురు పాల్గొన్నారు.



