ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
పిఎన్ పిఎస్ దోమ మండల అధ్యక్షుడు ప్రతాప్ గౌడ్
దోమ నవంబర్ 15(జనం సాక్షి)
గ్రామీణ ప్రాంతా ప్రజలు ఉచితంగా నిర్వహించే వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని పిఎన్ పిఎస్ దోమ మండల అధ్యక్షుడు ఈ ప్రతాప్ గౌడ్ అన్నారు. మంగళవారం దోమ మండల కేంద్రంలో ఈ శారదా హాస్పిటల్ వారు నిర్వహిస్తున్నఉచిత వైద్య శిబిరాన్ని వారు సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలు పేదలకు ఎంతో మేలు కలిగిస్తాయన్నారు. పేదలకు ఉచితంగా వైద్య సేవలు, మందులు అందించేందుకు శ్రీ శారద హాస్పిటల్ వారు ముందుకు రావడం అభినందనీయమన్నారు. వృద్ధులు, పేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పృద్వి,డాక్టర్ మీనాక్షి,డాక్టర్ రాకేష్,డాక్టర్ బాలు, డాక్టర్ఉమామహేశ్వర్, శ్రీ శారద హాస్పిటల్ సిబ్బంది, గ్రామ ప్రజలుతదితరులు పాల్గొన్నారు.