ప్రభుత్వ పాఠశాలపై నమ్మకంతో తన కుమారుడిని చేర్పించిన మాజీ సర్పంచ్

సిరికొండ , జూన్ 20 (జనం సాక్షి): ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసాన్ని చాటుతూ సిరికొండ మండలం పోతునూర్ గ్రామ మాజీ సర్పంచ్ మంజుల బాలయ్య తన కుమారుడిని గోనుగొప్పుల తెలంగాణ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతిలో శనివారం చేర్పించారు.
ఈ సందర్భంగా గోనుగొప్పుల సర్పంచ్ సేపూర్ చరణ్ గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు బాలయ్యను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించేందుకు ప్రజాప్రతినిధులు ముందుండి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం ఆదర్శనీయమని పలువురు అభిప్రాయపడ్డారు.

తాజావార్తలు