అత్యాధునిక టెక్నాలజీతో అన్ని రకాల క్యాన్సర్ లకు చికిత్సలు అందుబాటులో

సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ ఆన్కాలజిస్ట్ డా సుమంత్ కుమార్
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జూన్ 19: జనం సాక్షి అత్యాధునిక టెక్నాలజీతో అన్ని రకాల క్యాన్సర్ లకు చికిత్సలు అందుబాటులో ఉన్నాయని, సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ ఆన్కాలజిస్ట్, హెమటాలజీ, స్పెషలిస్ట్ డాక్టర్ సుమంత్ కుమార్ మల్లుపట్టు అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని యశోద మెడికల్ కేర్ సెంటర్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రస్తుతం క్యాన్సర్ రోగాలకు, అనేక రకాల క్యాన్సర్ చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయని, అందరికీ ఒకే విధమైన చికిత్స అవసరం ఉండదని అన్నారు. ప్రతి వ్యక్తి పరిస్థితిని బట్టి చికిత్స నిర్ణయించబడుతుందన్నారు. చికిత్స యొక్క ముఖ్య ఉద్దేశాలు క్యాన్సర్‌ను పూర్తిగా నియంత్రించడం, తగ్గించడం,రోగి జీవిత నాణ్యత మెరుగుపరచడం,చికిత్స వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ తగ్గించడం, అవసరమైన చికిత్సను తగ్గించకుండా, సైడ్ ఎఫెక్ట్స్ ను మినిమైజ్ చేయడం, ఆధునిక టెక్నాలజీ ప్రయోజనాలు అని అన్నారు.ప్రస్తుతం ఆసుపత్రుల్లో చాలా పురోగతి చెందిన క్రొత్త టెక్నాలజీ రేడియేషన్ పరికరం హైపర్ సైట్ ఉపయోగిస్తున్నారన్నారని అన్నారు. ఈ కొత్త పద్ధతుల వల్ల వైద్యం మరింత ఉపయోగం కలిగిస్తోందని తెలిపారు.రేడియేషన్ వైద్యం ప్రత్యేకతలు క్యాన్సర్ ఉన్న భాగాన్ని మాత్రమే టార్గెట్ చేసి చికిత్స చేయడం వలన చుట్టూ ఉన్న మామూలు కణజాలానికి నష్టం తక్కువగా ఉంటుందని తెలిపారు. వైద్యం చాలా ఖచ్చితంగా ఇవ్వబడుతుందని అన్నారు. ఆయన యశోద మెడికల్ సెంటర్ నిజామాబాద్ లో ప్రతి 3వ శుక్రవారం అందుబాటులో ఉంటానని తెలిపారు.ఈ సమావేశంలో సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీ రామ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.



