మానవతా సేవలో పోలీసు శాఖ..

“మా” అభాగ్యుల వృద్ధాశ్రమాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ.
వృద్ధులకు పండ్లు, నిత్యావసర సరుకులు పంపిణీ.
గంభీరావుపేట జూన్ 20 (జనం సాక్షి); గంభిరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని “మా” అభాగ్యుల వృద్ధాశ్రమాన్ని శనివారం రోజున జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే సందర్శించారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులు,అవసరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వృద్ధులకు పండ్లు,బియ్యం,కిరాణా సరుకులు మరియు ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.సమాజంలో వృద్ధులు, నిరాశ్రయులు,అనాథల సంక్షేమం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.వృద్ధుల సేవ చేయడం గొప్ప మానవతా ధర్మమని, వారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు.అవసరమైన వారికి సేవలు అందించడంలో జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ వెంకటేష్, ఎస్.ఐ శ్రీకాంత్, మా అనాధ వృద్ధాశ్రమం చైర్మన్ మల్లు గారి నర్సాగౌడ్, వృద్ధాశ్రమ సభ్యులు ఉన్నారు.



