క్లోరో హైడ్రేట్ పట్టుకొని వదిలేసిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ

చోద్యం చూస్తున్న అధికారులు

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జూన్ 19: జనం సాక్షి నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి మండల పరిధిలో గల ఎల్లారెడ్డిపల్లి గ్రామంలోని కల్లు డిపోలో గురువారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ మరో ఇద్దరు సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా అట్టి కల్లులో సిహెచ్ క్లోరోహైడ్రేడ్ ఉన్నట్టు గుర్తించడం జరిగింది.అయినప్పటికీ ఎలాంటి కేసులు చేయకుండా డబ్బులకు కక్కుర్తి పడి వదిలివేయడం సీఐ పనితనానికి నిలువెత్తు నిదర్శనం.గత కొద్ది రోజుల నుండి ఎక్సైజ్ డిసి డిప్యూటీ కమిషనర్ రఘురాం గ్రావిటీ కేసులు విధించాలని సిబ్బందికి పలుమార్లు సూచనలు చేసినప్పటికీ సిహెచ్ ను పట్టుకొని వదిలివేయడంతో పై అధికారుల ఆదేశాలను ఎంతవరకు పాటిస్తున్నారు దీనినిబట్టి చెప్పవచ్చు.సదరు సీఐ కుల ఫీలింగ్ తో సిబ్బందిని కూడా వేరు చేస్తున్నాడని మాట్లాడుకుంటున్నారు. ప్రభుత్వం ఒకవైపు నిషేధిత ఉత్ప్రేరకాలను పూర్తిగా నిషేధిస్తున్నామని చెప్తున్నప్పటికీ సిబ్బంది నిర్వాకంతో నీరుగారి పోతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గతంలో కూడా ధర్పల్లి మండలం ప్రాజెక్టు రామడుగు గ్రామంలో అల్ప్రజోలం పట్టుకుని డబ్బులకు కక్కుర్తి పడి వదిలివేసిన సంఘటన సదరు సిఐ నిర్వాకంతో వెలుగులోకి వచ్చినప్పటికీ షరా మామూలే అని తనను ఏ అధికారి కూడా ఏమి చేయలేడని దర్జాగా మామూల్ల మత్తులో జోగుతుండడం సిబ్బందికి అటు ఎక్సైజ్ శాఖకు తీవ్ర ఆందోళన కలిగిస్తుందని వాపోతున్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి సదరు శాఖ పై అధికారులు చొరవ తీసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.