ఉత్తర భారతంలో స్వల్ప భూప్రకంపనలు
న్యూఢిల్లీ: ఉత్తర భారత దేశంలో బుధవారం పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. నోయిడా, శ్రీనగర్, పంజాబ్, చండీగఢ్‌తో పాటు వాఘా సరిహద్దులోనూ భూప్రకంపనలు వచ్చాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు కాశ్మీర్‌లో భూకంపం సంభవించింది. అయితే ఎలాంటి ఆస్తినష్టం జరగలేదు.