ఉద్యమకారులకు సముచిత స్థానం దక్కింది.

దౌల్తాబాద్, సెప్టెంబర్ 15,జనం సాక్షి.
మలిదశ తెలంగాణ పోరాటంలో తొలి నుండి టిఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి ఉద్యమంలో తమదైన పాత్ర పోషించిన నాయకులకు పదవులు దక్కడం తెరాస పార్టీకి ఉద్యమకారుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని, ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తూ మార్కెట్ కమిటీ పాలకమండలిని ఎన్నుకున్నారని ఏఎంసీ చైర్మన్ ఇప్ప లక్ష్మి తెలిపారు. దౌల్తాబాద్ మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన ఏఎంసీ పాలక మండలి సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటినుండి పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తూ, పార్టీకి విధేయులుగా ఉంటున్న వారికి దక్కడం ఆనందించ దగ్గ విషయమని అన్నారు. బీసీ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం, మొదటి నుంచి పార్టీలో పని చేస్తున్న వారికి పదవులు కట్టిపెట్టడంతో పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారని,సామాజిక సమీకరణాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పించి మార్కెట్ కమిటీ పాలకమండలి పూర్తి చేయడం పట్ల మంత్రి హరీష్ రావుకి,మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పదవి కల్పించిన రాష్ట్ర మంత్రి హరీష్ రావు కి, మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు అందుబాటులో ఉండి ప్రభుత్వ పరంగా వచ్చే అన్ని పథకాలు రైతులకు చేరే విధంగా కృషి చేస్తానని తెలిపారు.అనంతరం అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేశారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ వేమ శ్రీనివాస్,డైరెక్టర్లు పబ్బ అశోక్, సత్యనారాయణ, లక్ష్మణ్, మల్లేష్, వెంకట్ రాంరెడ్డి, సంతోష్ కుమార్,తుడుం నర్సింగరావు, తెరాస నాయకులు మస్తాన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.