*ఉపాధి హామీ సామాజిక తనిఖీ గ్రామ సభ*

ముగాలన, జూలై 13(జనంసాక్షి): మండల పరిధిలోని బరాఖత్ గూడెం గ్రామంలో 2019 నుండి 2022 మార్చి వరకు గ్రామంలో జరిగిన ఉపాధి హామీ పనుల వివరాలను సామాజిక తనిఖీ అధికారి గురువయ్య పర్యవేక్షణలో సిబ్బంది మూడు రోజుల పాటు గ్రామంలో తిరిగి కూలీల నుండి వివరాలు సేకరించారు. బుధవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉపాధి హామీ సామాజిక తనిఖీ గ్రామసభను సర్పంచ్ కొప్పుల వీరమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలో జరిగిన పనుల వివరాలు అందులో ఉన్న లోపాలను గ్రామసభ దృష్టికి తనిఖీ అధికారి గురవయ్య తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ వీరమ్మ మాట్లాడుతూ, గ్రామంలో ఉపాధి పనులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, అధికారులు సూచించిన కొలతల ప్రకారం పనులు చేసి అధిక వేతనం పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జి. వెంకటేశ్వర్లు తనిఖీ సిబ్బంది శ్రావణి ప్రియాంక, ఫారెస్ట్ టిఏ శంబయ్య, గ్రామ పెద్దలు జెట్టి రామిరెడ్డి, నరాల రుక్కారావు, గంధం సైదులు, నాగరాజు అక్బర్, పాషా, వెంకటేశ్వర్లు మెట్లు ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.