ఉప్పలవాయిలో బాలుర 8 వ జోనల్ క్రీడా పోటీలు..ప్రారంబించిన కలెక్టర్ జితేష్ వీ పాటీల్
రామారెడ్డి సెప్టెంబర్ 25 (జనంసాక్షీ) :
రామారెడ్డి మండలం ఉప్పలవాయి గ్రామంలో గల గురుకుల బాలుర పాఠశాల లో 8 వ జోనల్ క్రీడా
పోటీలను కామారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీ జితేశ్ వి. పాటిల్ ముఖ్య అతిధిగా హాజరై జ్యోతి ప్రజ్వాలన చేసి పోటీలను ప్రారంభిచారని కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమములో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ, క్రీడల వల్ల శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారు అవుతారని అన్నారు. ఒకరికి ఒకరు సహాయం చేసుకొని సహాయ గుణాన్ని ఏర్పరచుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు.అలాగే తన విద్యార్థి దశ అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నా రు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిధిగా శ్రీ హుస్సేన్, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ
విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ , శ్రీమతి మేరీ ఏసుపాదం, ప్రాంతీయ సమన్వయ అధికారి కే.
కృష్ణమూర్తి , రామారెడ్డి జెడ్పిటిసి. సర్పంచ్ గంగా రాం, ఉపసర్పంచ్ సరస్వతి, ఎపీటీసీ ఉమాదేవి, కళాశాల అద్యపకులు , వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.