ఎక్సయిజ్ దాడిలో 14 లీటర్ల గుడుంబా స్వాధీనం
ఎసై రాయబారపు రవి కుమార్
ఖానాపూర్ రూరల్ 15 సెప్టెంబర్ (జనం సాక్షి): ఎక్సయిజ్ అధికారుల దాడిలో 14 లీటర్ల గుడుంబా,ముగ్గురు పై కేసు నమోదు చేసినట్లు ఎక్సయిజ్ ఎసై రాయబారపు రవికుమార్ గురువారం తెలిపారు.ఎక్సయిజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఖానాపూర్ మండలంలో విసృత తనిఖీలు చెప్పటామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాంరెడ్డి పల్లె కు చెందిన బుక్యా అరవింద్, అజ్మీరా సునీత ల దెగర పది లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకొని ఇద్దరి పై కేసునమోదు చేసినట్లు తెలిపారు.సమాచారం మేరకు తర్లపాడ్ గ్రామంలోని తనిఖీలు చెప్పటగా శివాజీ వద్ద ఉన్న నాలుగు లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.ఈ తనిఖీ లో ఉన్న సిబ్బంది ముత్యం,ప్రకాష్,గౌతమ్,రవీందర్,రాజశేఖర్,కల్పన పాల్గొన్నారు.