ఎడపల్లి లో ఉచిత వైద్య శిబిరం..

మహాదేవపూర్( కాలేశ్వరం )జూలై 08 జనంసాక్షి న్యూస్:
మహదేవపూర్ మండలంలోని కాలేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్, వారి సిబంది తో కలిసి శుక్రవారం నాడు ఎడపల్లి గ్రామపంచాయతీ లో ఉచిత వైద్య శివరాం ని ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ కుమ్మరి చిన్న మల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరంలో 36 మంది కి పరీక్షలు చేయగా, ఒక్కరు జ్వరాపిడితుడికి రక్త పరీక్ష చేసి ఉచితంగా మందులు పంపిణి చేసి,ఒక్కరికి ర్యాఫీడ్ మలేరియా పరీక్ష చేయగా, 9 మందికి మధుమేహ నిర్ధారణ పరీక్షలు చేసి మందులు పంపిణి చేశామని అన్నారు. తదనంతరం గ్రామంలో ప్రతి కాలనిలో డ్రైడే ప్రైడే ద్వారా ప్రజలకు వర్షాకాలంలో దోమకాటు, మలేరియా, డెంగ్యూ మొదలగు వ్యాధులపై అవగాహనా కలిపిస్తూ వాడ వాడ తిరిగారు చెప్పారు. ప్రతి ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమం లో డాక్టర్ జగదీష్, హెచ్ ఈ ఓ ఏ స్వామి, ఎల్ టి శ్రీనివాస్, హెల్త్ అసిస్టెంట్ అడప రాజారమణయ్య, ఏ ఎన్ ఎం లు హేమలత, వెంకటమ్మ, ఆశాలు  మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.