ఎన్నికల బడ్జెట్‌పై పౌరుల్లో ఆసక్తి

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ అంటే అందరికీ ఆసక్తే… ఎలాంటి అంశాలు ప్రవేశపెడతారు.. వ్యవసాయ, కార్మిక రంగానికి ఏ విధమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రభుత్వ ఉద్యోగుల ఆదాయపన్ను పరిమితి పెరుగుతుందా.. మహిళలకు కొత్త పథకాలు ప్రకటిస్తారా… ఇలా పలు అంశాలపై దేశ ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తారు. ఈసారి ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. మరో రెండు,మూడు నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో వాటి చుట్టే బడ్జెట్‌ ఉంటుందనడంలో సందేహం లేదు. 31న బడ్జెట్‌ సమావేవాలు మొదలవుతాయి. 1న బడ్జెట్పవ్రేశ పెడతారు. సర్వేలు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంచనాలు చెప్పడంతో అందుకు అనగుఉణంగా తాయిలాలు ప్రకటించే వీలుంది. ఎన్నికల సంవత్సరం కాబట్టి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశ పెట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి1న ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంతో పాటు పారదర్శకత తీసుకొచ్చేలా కేంద్రం చర్యలు తీసుకొంటుందన్న భావన ఉంది. ఇందులో భాగంగా సూచనలు, సలహాలు ఆర్థికశాఖ స్వీకరిస్తోంది. దేశంలో 70 శాతం మంది సన్న,చిన్నకారు రైతులే అధికం. వీరు ఆదాయపు పన్ను చెల్లింపు పరిధిలోకి రాకపోయినప్పటికీ కేంద్ర బడ్జెట్‌పై చాలా ఆసక్తి ఉంటుంది. ఈ సారి బడ్జెట్‌లో దీనిపై చర్చ జరగనుందని అంటున్నారు. రైతులకు మేలు చేసేవిధంగా విత్తన చట్టం రూపొందించాలని కోరుకుంటు న్నారు. తెలంగాణ వ్వయసాయ విధానం బాగుందన్న ప్రశంసలు సర్వత్రా వస్తున్నాయి. రైతుబందు, రైతుబీమా వంటి పథకాలను ప్రముఖ సంగసేవకుడు అన్నా హజారే కూడా ఇటీవల ప్రస్తుతించారు. ఐక్యరాజ్య సమితిలో కూడా చర్చకు వచ్చింది. దీంతో వ్యవసాయం ప్రధానంగా బడ్జెట్‌ రూపకల్పన ఉంటుందన్న ఉప్పు అందుతోంది. వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంటుంది. వ్యవసాయ యంత్రీకరణలో భాగంగా వ్యవసాయ పనిముట్లు, వ్యవసాయానికి పనికొచ్చే వాహనాలను తయారీ చేసే సంస్థల, దిగుమతి చేసే సంస్థలకు విధించే పన్నులలో మార్పు తీసుకురావాలి. స్వదేశంలో తయారుచేసే వస్తుత్పత్తిపై ఎక్జ్సైజ్‌ డ్యూటీ, విదేశాల నుంచి దిగుమతి చేసే యంత్రాలు, పరికరాలపై కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్‌ డ్యూటీ విధిస్తుంది. వీటిని తగ్గించడం వల్ల వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగి రైతులపై పెట్టుబడి భారం తగ్గుతుంది. రైతులు పండించే పంటలను నిల్వ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి మండలంలో గిడ్డంగుల నిర్మాణం చేపట్టాలి. ప్రస్తుతం చేపట్టిన గిడ్డంగులన్నీ అన్నదాతలకు కాకుండా వ్యాపారులకు మాత్రమే ఉపయోగకరంగా ఉంటున్నాయి. రైతులనుంచి కొనుగోలు చేసిన వ్యవసాయ ఉత్పత్తులను గిడ్డుంగులలో భద్రపరిచి ధర పెరిగినప్పుడు విక్రయించి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. అదే రైతుకు నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో తక్కువ ధర ఉన్నప్పటికీ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం నేరుగా వ్యవసాయ గిడ్డుంగుల నిర్మాణం చేపట్టలేకపోయినా కనీసం వీటి నిర్మాణానికి ప్రైవేట్‌ వ్యక్తులనైనా ప్రోత్సహించాలి. గిడ్డుంగులు నిర్మించే వారికి ప్రభుత్వ రాయితీలు అందించాలి. విత్తనచట్టాన్ని చాలా పకడ్బంధీగా రూపొందించాలి. ఇటీవల నకిలీ మిర్చి విత్తనాలు కొనుగోలు చేసి వేలాదిమంది రైతులు పంటనష్టపోయారు. అయినా విత్తన కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చిరువ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ముద్ర రుణాలు పథకాన్ని పటిష్ఠం చేయాల్సి ఉంది. రూ.10 లక్షలలోపు ఎలాంటి హావిూ లేకుండా రుణం ఇవ్వడానికి దీన్ని ప్రవేశపెట్టినా బ్యాంకర్ల వైఖరి వల్ల చాలా మందికి ఈ రుణాలు అందకుండా పోయాయి. బ్యాంకు మేనేజర్‌, సిబ్బందికి పరిచయమున్న వ్యక్తులకు మాత్రమే రూ.5 వేల నుంచి రూ.50 వేల లోపు రుణాలిచ్చి చేతులు దులుపుకున్నారు. కేంద ప్రభుత్వం ఈ సారి ఈ పథకంలో మార్పులు తీసుకురావాలి. ప్రతి బ్యాంకు పరిధిలో వ్యవసాయ రుణాల లక్ష్యం ఎలాగైతే కచ్చితంగా నిర్ణయిస్తారో అంతే కచ్చితంగా ముద్ర రుణాలి చ్చేలా చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం ప్రత్యేకంగా మండలాల వారీగా మానిటరింగ్‌ సెల్‌ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చిరువ్యాపారులు కోరుకుంటున్నారు. బడ్జెట్‌లో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం తోపాటు పారదర్శకత తీసుకొచ్చేలా కేంద్రం చర్యలు తీసుకుంటుంది. బడ్జెట్‌కు సూచనలు అందించా ల్సిందిగా ప్రజలను ఆర్థిక శాఖ ఆహ్వానించింది. గతేడాది రైల్వే, కేంద్ర బడ్జెట్‌లపై ప్రజల నుంచి వేలాదిగా సూచనలు అందినట్లు పేర్కొంది. వాటిలో కొన్నింటిని బడ్జెట్‌ తయారీలో పరిగణనలోకి తీసుకున్నా మని వెల్లడించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న బడ్జెట్‌లో ఎరువులపై ప్రత్యక్ష నగదు బదిలీ, సాగునీటికి ప్రత్యేక నిధి ఏర్పాటు, పప్పు ధాన్యాల కోసం ధరల స్థిరీకరణ నిధి, ప్రత్యేక వ్యవసాయ పన్నును ప్రవేశపెట్టడం వంటి వాటిని ప్రజల సూచనల నుంచే స్వీకరించినట్లు తెలిపింది. మొత్తంగా ఆదాయపన్ను, పదిశాలం అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు, రైతులను లక్ష్యంగా చేసుకుని తాయిలాలు ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ దిశగా అనేక విషయాలు చర్చించే వీలుంది. రైతులకు నేరుగా డబ్బు జమచేసేలా కూడా కార్యాచరణ రానుందన్న సంకేతాలు ఉన్నాయి. మొత్తంగా ఏ వర్గానికి ఎంతెంత కేటాయింపులు చేస్తారో ఫిబ్రవరి 1న తేలనుంది. అది ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఉంటుందనడంలో సందేహం లేదు.