కాళేశ్వరంపై ఎన్డీఎస్‌ఏ నివేదికే కీలకం

` మేడిగడ్డ లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు
` స్పీకర్‌ పరిధిలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం
` మానేరు రివర్‌ ఫ్రంట్‌ పనులు పూర్తి చేస్తాం: మంత్రి శ్రీధర్‌ బాబు
` మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌తో కలిసి పలు అభివృద్ధి పనుల ప్రారంభం.
కరీంనగర్‌ బ్యూరో(జనంసాక్షి):మేడిగడ్డ ప్రాజెక్ట్‌ లాంటి సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి శ్రీధర్‌ బాబు వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై డ్యాం సేప్టీ అథారిటీ నివేదిక ఆధారంగా ముందుకెళ్తామని తెలిపారు. మేడిగడ్డ లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుపై సిట్‌ దర్యాప్తు చేస్తోందన్నారు. ఈ కేసులో ఎవరెవరిని విచారణకి పిలవాలన్నది సిట్‌ అధికారులే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ విచారణలో రాజకీయ జోక్యం లేదని స్పష్టత ఇచ్చారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై అధికారులే విచారణ చేస్తున్నారని తెలిపారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌తో లోపాయికారిగా ఒప్పందం చేసుకుందని విమర్శించారు. తమ మేనిఫేస్టో లోనే కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జ్యూడీషనల్‌ ఎంక్వైరీ వేస్తామని చెప్పామని.. అన్నట్లుగానే వేశామని గుర్తుచేశారు. సోమవారంమంత్రి శ్రీధర్‌ బాబు కరీంనగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌ బాబు విూడియాతో మాట్లాడారు. రాజ్యాంగ వ్యవస్థలపై తమకు నమ్మకం ఉందని ఉద్ఘాటించారు. 42శాతం బీసీ రిజర్వేషన్ల అంశం రాష్ట్రపతి వద్ద పెండిరగ్‌లో ఉందని చెప్పుకొచ్చారు. జంతర్‌ మంతర్‌ వద్ద తమ నిరసన ధర్నాకు బీజేపీ ఎంపీలు ఎందుకు మద్దతు పలకలేదని ప్రశ్నించారు. బీసీల గురించి బీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడితే జనం నమ్ముతారా అని నిలదీశారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై విచారణకు ఎవరినీ పిలవాలన్నది సిట్‌ అధికారులే నిర్ణయిస్తారని వెల్లడిరచారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌దేనని మంత్రి శ్రీధర్‌ బాబు పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తుది నిర్ణయం స్పీకర్‌దేనని మంత్రి శ్రీధర్‌ బాబు స్పష్టం చేశారు. 42శాతం బీసీ రిజర్వేషన్ల అంశం రాష్ట్రపతి, కేంద్రం వద్ద పెండిరగ్‌లో ఉందని తెలిపారు. రాష్టాన్ర్రికి చెందిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు బీసీ బిల్లులను ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన దీక్షకు బీజేపీ ఎందుకు మద్దతు తెలపలేదు..? ఆ పార్టీ ఎంపీలు ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. అలాంటిది ఈరోజు బీసీల గురించి ప్రతిపక్షాలు మాట్లాడితే నమ్ముతారా అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లతోనే ముందుకు పోతామని స్పష్టం చేశారు.
పకడ్బందీ ప్రణాళికతో కరీంనగర్‌ అభివృద్ధి..
పకడ్బందీ ప్రణాళికతో కరీంనగర్‌ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, ఒక మాడల్‌ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌ బాబు పేర్కొన్నారు. సోమవారం కరీంనగర్‌ లోని వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పక్కన సుడా వాణిజ్య భవన సముదాయ నిర్మాణం, ఐడిఎస్‌ఎంటి షాపింగ్‌ కాంప్లెక్స్‌ ఆధునీకరణ పనులకు మంత్రి శ్రీధర్‌ బాబు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ హాజరయ్యారు. దాదాపు 4.79 కోట్లతో మౌలిక వసతుల కల్పన ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌ బాబు మీడియాతో మాట్లాడారు. కరీంనగర్‌ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. నాలుగు కోట్లతో సుడా వాణిజ్య భవన నిర్మాణాన్ని చేపడుతు న్నామని తెలిపారు. ప్రస్తుతం రెండు కోట్లు మంజూరు అయ్యాయనీ, వాటితో పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఐడిఎస్‌ఎంటి షాపింగ్‌ కాంప్లెక్స్‌ పనులు 79 లక్షలతో చేపడుతున్నామని తెలిపారు. అభివృద్ధి పనులకు సంబంధించిన పనులు నాణ్యతతో చేపట్టేలా అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ జరపాలని సూచించారు. పనులు వేగవంతంగా చేపట్టి త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఇందుకు అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో నగరంలో మిగిలిపోయిన పనులకు ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామనీ, ఆ పనులు వేగవంతంగా పూర్తయ్యేలా చూస్తామన్నారు. అదేవిధంగా కరీంనగర్‌ కు తలమానికంగా నిలిచే మానేర్‌ రివర్‌ ఫ్రంట్‌ పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కరీంనగర్‌ శాతవాహన యునివర్సిటీ లో తాము ఏర్పాటు చేసిన గ్రూపులతోనే యూనివర్సిటీ రన్‌ అయిందనీ, తమ ప్రభుత్వం వచ్చాక శాతవాహన యూనివర్శిటీ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి శ్రీధర్‌ బాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మహేశ్వర్‌, మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్‌, మృత్యుంజయం, జిల్లాఅధికారులు, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

సీఎం రేవంత్‌ రెడ్డిపై కేసు కొట్టివేత

` పిటీషనర్‌కు హైకోర్టు అక్షింతలు
హైదరాబాద్‌ (జనంసాక్షి):సిఎం రేవంత్‌రెడ్డిపై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. 2019 అక్డోబర్‌లో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి పీఎస్‌లో ఆయనపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని నమోదైన ఈ కేసును కొట్టేయాలని రేవంత్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలావుంటే రేవంత్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ- కేసు దాఖలు చేసిన పిటిషనర్‌ పెద్దిరాజుకు సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మౌసమి భట్టాచార్యకు అఫిడవిట్‌ రూపంలో క్షమాపణలు చెప్పాలని సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ధర్మాసనం ఆదేశించింది. రేవంత్‌రెడ్డిపై పెద్దిరాజు దాఖలు చేసిన కేసును గతంలో తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఆ కేసును నాగ్‌పుర్‌ బెంచ్‌కు బదిలీ చేయాలని సుప్రీంకోర్టులో పెద్దిరాజు ట్రాన్స్‌ఫర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అందులో హైకోర్టు న్యాయమూర్తిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. పిటిషన్‌ డ్రాప్ట్‌ చేసిన ఏఓఆర్‌, పెద్దిరాజుపై సీజేఐ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మౌసమి భట్టాచార్యకు క్షమాపణలు చెప్పాలని తెలిపింది. క్షమాపణ చెపుతూ దాఖలు చేసే అఫిడవిట్‌పై నిర్ణయాన్ని జస్టిస్‌ మౌసమి భట్టాచార్యకు వదిలేసింది. వారం రోజుల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని పెద్దిరాజుకు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.