సివిల్స్‌లో సత్తా చాటాలి
` తెలంగాణ నుంచి అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఎంపికవ్వాలి
` అన్ని విధాలుగా సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం
` ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో బ్యూరోక్రసీ పాత్ర కీలకం
` రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్(జనంసాక్షి):సివిల్స్ లో తెలంగాణ నుంచి అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఎంపికవ్వాలనీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం ఆయన ప్రజాభవన్లో సింగరేణి ఆధ్వర్యంలో మెయిన్స్ కు ఎంపికైన 178 మందికి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించే కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మానవ వనరులు అతి ముఖ్యమైనవి అవి బలమైన పెట్టుబడులని, ఆ మానవ వనరులను సానబట్టి వజ్రాలుగా తయారు చేస్తే సమాజానికి పెద్ద ఎత్తున ఉపయోగపడతారని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఆలోచన చేసి సివిల్స్ కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఎంతో కొంత సాయం చేస్తే వారు లక్ష్యం సాధించేందుకు ఉపయోగపడుతుందని ఈ కార్యక్రమం చేపట్టినట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. సివిల్స్ సాధించేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అన్ని విధాలుగా సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అభ్యర్థులకు మనోధైర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వరుసగా రెండో సంవత్సరం కార్యక్రమంలో చేపట్టిందినీ డిప్యూటీ సీఎం తెలిపారు. మెయిన్స్ కు ఎంపికైన 178 మందికి లక్ష రూపాయల చొప్పున అందిస్తున్నాము. ఇంటర్వ్యూ కి ఎంపికైన వారికి కూడా లక్ష ఆర్థిక సాయం ఢల్లీిలో వసతులు కల్పిస్తాం అని భరోసా ఇచ్చారు. మొదటి సంవత్సరం 148 మందికి ఆర్థిక సహాయం అందించగా పదిమంది సివిల్ సర్వీస్ కి ఎంపికయ్యారని వివరించారు.ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో బ్యూరోక్రసీ పాత్ర కీలకం, ప్రజల జీవన స్థితిగతులు మార్చడానికి సివిల్ సర్వీసెస్ ద్వారా అవకాశముంటుంది. వేలాదిమంది రాష్ట్రంలో పనిచేసిన ఎస్సార్ శంకరన్, పార్థసారధి, మాధవరావు వంటి కొద్ది మంది పేర్లు మాత్రమే జనం గుండెల్లో నిలిచిపోయారు అని అన్నారు. నిబద్ధత సేవలందిస్తే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తీసుకువచ్చే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిస్థాయిలో ప్రజలకు చేరవేస్తేనే ప్రభుత్వాలు ఆశించిన లక్ష్యాలు నెరవేరుతాయి అన్నారు. అధికారుల్లో చిత్తశుద్ధి లోపిస్తే ప్రభుత్వ లక్ష్యాలు ఎంత గొప్పగా ఉన్నా ఫలితం ఉండదు అన్నారు. %ూతీ% శంకరన్ సాంఘిక సంక్షేమ శాఖలో సెక్రటరీగా ఉన్నప్పుడు చేపట్టిన కార్యక్రమాలు ప్రజల జీవన స్థితిగతులు మార్చడానికి ఉపయోగపడ్డాయి అన్నారు. 45 వేలకు పైబడి ఉన్న సింగరేణి కార్మికులు సింగరేణి సంస్థను బతికిస్తూ పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు మీ ప్రయత్నంలో విజయం సాధించే క్రమంలో సింగరేణి కార్మికుల ఆశీస్సులు మీకు ఉంటాయని డిప్యూటీ సీఎం తెలిపారు.