కాళేశ్వరం నివేదికపై ఏం చేద్దాం?

` కేటీఆర్‌, హరీశ్‌లతో కేసీఆర్‌ మంతనాలు
` ఫామ్‌హౌజ్‌లో తదితర అంశాలపై చర్చ
గజ్వెల్‌(జనంసాక్షి):కాళేశ్వరం నివేదక తరవాత మాజీ సిఎం, బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ వరుసగా పార్టీ ముఖ్యులతో భేటీ అవుతున్నారు. ఎర్రవల్లిలోని ఫామ్‌ హౌస్‌ వేదికగా బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ తన ముఖ్య అనుచరులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్‌, హరీష్‌ రావు, మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌తో ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కాళేశ్వరం కమిషన్‌ రిపోర్టుకు సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్లే విషయంపై వారు కూలంకుషంగా చర్చించారు. అలాగే ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై సైతం సుప్రీంకోర్టుకు వెళ్లాలని వారంతా నిర్ణయించారు. దీంతో పామ్‌హౌస్‌ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో పామ్‌హౌస్‌ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అదే విధంగా బీఆర్‌ఎస్‌ పార్టీని బీజేపీలో విలీనం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఈ సందర్భంగా పార్టీ కీలక నేతలకు అధినేత కేసీఆర్‌ స్పష్టమైన సూచన ఇచ్చినట్లు- సమాచారం. రూ. లక్షల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం.. జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ను నియమించింది. దాదాపు 15 నెలల పాటు- విచారించిన ఈ కమిషన్‌.. ఇటీ-వల ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ నివేదికలో ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో అంతా బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ కీలకమని స్పష్టం చేసినట్లు- కథనాలు వెల్లువెత్తాయి. దీనిపై రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు- చేసింది. ఈ సిట్‌ నివేదిక ఆధారంగా దోషులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని భావిస్తున్నారు. ఇక రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం.. ఆపరేషన్‌ ఆకర్ష్‌ చేపట్టింది. దీంతో బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పలువురు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ అంశంపై బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన కేటీఆర్‌తోపాటు- పలువురు నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కోర్టు తీర్పుపై సంతృప్తి చెందని ఆ పార్టీ నేతలు.. సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారని సమాచారం. మరోవైపు బీఆర్‌ఎస్‌ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు- ఒక ప్రచారం అయితే ఉదృతంగా సాగుతోంది. ఈ ప్రచారాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పటికే ఖండిరచింది.