ఎన్‌కౌంటర్లపై సుప్రీం ఆగ్రహం…రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులపై మండిపాటు

-చంపాలనుకుంటే మావోయిస్టు అని ముద్రవేస్తారా..? ప్రమోషన్ల కోసం ఎన్‌కౌంటర్లు చేస్తారా..?
పోలీసులను ప్రశ్నించిన అత్యున్నత న్యాయస్థానం
న్యూఢిల్లీ: నకిలీ ఎన్‌కౌంటర్లపై అత్యున్నత న్యాస్థానం రాష్ట్ర ప్రభుత్వంపై, పోలీసులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు చంపాలనుకున్న వ్యక్తులపై మావోయిస్టు ముద్ర వేస్తారా..? అని పోలీసులపై మండిపడింది. ప్రమోషన్ల కోసం ఎన్‌కౌంటర్లు చేస్తే ఐరుకుంటారా..? అని సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. ప్రమోషన్ల కోసం ఎన్‌కౌంటర్లు చేస్తున్న అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రభుత్వాన్ని నిలదీసింది. ఆంధ్రప్రదేశ్‌ నకిలీ ఎన్‌కౌంటర్లు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులకు పదోన్నతులు ఇవ్వడానికి సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం విచారించింది. ఈ సందర్భంగా గ్రేహౌండ్స్‌ ఐజీ పి.సీతారామాంజనేయులు విషయాన్ని పిటిషనర్లు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఆయన కర్నూలు, గుంటూరు జిల్లాలకు ఎస్పీగా పని చేసిన సమయంలో జరిగిన 19ఎన్‌కౌంటర్లలో 16ఎన్‌కౌంటర్లు నకిలీవేనని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ తేల్చిచెప్పిన విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. బాధితుల కుటుంబానికి రూ.5లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని నమోదు చేయకుండా వదిలేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రామాంజనేయులు ఫేక్‌ ఎన్‌కౌంటర్లకు పాల్పడ్డాడని వెల్లడైనా.. ఆయనను ఇంకా ఐజీ గా కొనసాగిస్తుండడంపై ఫిర్యాదు చేశారు.
విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ‘మీరు చంపాలనుకున్న వ్యక్తిపై మావోయిస్టు ముద్ర వేస్తారా..? ప్రమోషన్ల కోసం నకిలీ ఎన్‌కౌంటర్లు చేస్తారా..? అని పోలీసుల తీరుపై మండిపడింది. మరోవైపు ప్రభుత్వంపైనా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ప్రమోషన్ల కోసం ఎన్‌కౌంటర్లు చేస్తే ఊరుకుంటారా..? అని ప్రభుత్వాన్ని నిలదీసింది. ఫెక్‌ ఎన్‌కౌంటర్లకు పాల్పడ్డ అధికారులపై ఇప్పటి వరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదని సూటిగా ప్రశ్నించింది. ప్రమోషన్ల కోసం ఎన్‌కౌంటర్లకు పాల్పడ్డ అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. నకిలీ ఎన్‌కౌంటర్లు చేస్తున్న అధికారులకు పదోన్నతులు కల్పించి ప్రోత్సహిస్తున్నారా..? అని మండిపడింది. అయితే, ఎన్‌కౌంటర్లకు సంబంధించిన వివరాలు ఇచ్చేందుకు రెండు వారాల సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించింది. దీనిపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆరేఉ్లగా విచారణ సాగుతోన్నా.. ఇంకా సమయం కావాలనడంపై మండిపడింది. రాష్ట్రంలో జరిగిన బోగస్‌ ఎన్‌కౌంటర్లపై వివరాలు ఇవ్వడంలో ప్రభుత్వం తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆఫిడవిట్‌ దాఖలు చేయాలన్న తమ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోక పోవడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్‌కౌంటర్లకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని తాము ఆదేశించినా స్పందించక పోవడంపై న్యాయస్థానం మండిపడింది. ఇలా చేస్తే ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లను తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో జరిగిన ఎన్‌కౌంటర్లపై రెండు వారాల్లో సమగ్ర నివేదిక అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.