ఎమ్మెల్యేకోటా ఎమ్మెల్సీలు ఏకగ్రీవం


` ఆరుగురు ఎమ్మెల్సీలు ధృవీకరణ పత్రాలు అందచేసిన రిటర్నింగ్‌ అధికారి
` కేసీఆర్‌ నేతృత్వంలో అభివృద్ధికి కృషిచేస్తామని వెల్లడి
` స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవిత
` నేడు నామినేషన్‌ వేయనున్న కేసీఆర్‌ తనయ
హైదరాబాద్‌,నవంబరు 22(జనంసాక్షి): ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసిన ఆరుగురు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుత్తా సుఖేందర్‌ రెడ్డి, కడియం శ్రీహరి, బండా ప్రకాశ్‌, తక్కెళ్లపల్లి రవీందర్‌ రావు, పాడి కౌశిక్‌ రెడ్డి, వెంకట్రామిరెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వెల్లడిరచారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఆరుగురు అభ్యర్థులకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ నెల 16న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, బండా ప్రకాశ్‌, పాడి కౌశిక్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అదే రోజు దాఖలు చేసిన మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు. దీంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమైంది. గత సభలో గుత్తా సుఖేందర్‌ రెడ్డి మండలి ఛైర్మన్‌గా వ్యవహరించారు. కడియం శ్రీహరికూడా గత సభలో ఉన్నారు. ఎంపిగా ఉన్న బండాప్రకాశ్‌ తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నిక య్యారు. ఎమ్మెల్సీలుగా ఎన్నికయినట్టు గెలుపు ధ్రువీకరణ పత్రాలు తీసుకున్న తర్వాత అసెంబ్లీ విూడియా పాయింట్‌ లో మంత్రి ప్రశాంత్‌ రెడ్డితో కలిసి కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌ రెడ్డి, బండా ప్రకాష్‌, తక్కెళ్ల పల్లి రవీందర్‌ రావు, వెంకట్రామి రెడ్డి, కౌశిక్‌ రెడ్డిలు విూడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి విూడియాతో మాట్లాడేతూ అందరు ఎమ్మెల్సీలూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యామని, తమకు అవకాశం ఇచ్చినందుకు సిఎం కెసిఆర్‌ కు ధన్యవాదాలు తెలిపారు. దేశంలో అన్ని రాష్టాల్ర కంటే తెలంగాణ ముందు ఉందని, అభివృద్ధి చెందుతున్న తెలంగాణ సిఎం కెసిఆర్‌ నేతృత్వంలో చిత్తశుద్ది పని చేస్తామని, టిర్‌ఎస్‌ ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందని, అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకు కెసిఆర్‌ కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఎదుగుతున్న తెలంగాణను ఓర్వలేక కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుందన్నారు. మోడీ, బిజెపి అధికారంలోకి వచ్చి ఏడేళ్లు అయిందని, ఈ ఏడేళ్లలో దేశ జిడిపి భారీగా తగ్గిందన్నారు.కరోన సమయంలో మైనస్‌ కి జిడిపి వెళ్లిందని, నరేంద్ర మోడీ గొప్ప పరిపాలన దక్షుడు అయితే దేశ జిడిపి ఎలా తగ్గిందో రాష్ట్ర బిజెపి నేతలు చెప్పాలని నిలదీశారు. ధాన్యం సేకరణ అనేది కేంద్రం పరిధిలోని అంశమని, కానీ కేంద్రం కొనటం లేదన్నారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవిత
నిజామబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి కల్వకుంట్ల కవిత ఖరారు అయ్యారు. నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటలో ఆమెను ఎంపిక చేస్తూ సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు కవిత నామినేషన్‌ వేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటాలోనే ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు. త్వరలో ఆమె పదవి కాలం ముగియనుండటంతో గులాబీ బాస్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. దీంతో మరోసారి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆమెను బరిలో దింపుతున్నారు. ఎమ్మెల్యే కోటాలో సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన చేసిన విషయం తెలిసిందే. కాగా 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ చేతిలో కవిత ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు కొంత కాలం దూరంగా ఉన్నారు. నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ భూపతిరెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో అనర్హత వేటుపడిరది. దీంతో ఆ స్థానం ఖాళీ కావడంతో అక్కడి నుంచి కవిత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే ఆమె పదవీ కాలం వచ్చే ఏడాది జనవరి 4తో ముగియనుంది. ఇప్పటికే స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో ఇప్పుడు మళ్లీ అదే స్థానం నుంచి ఆమెకు అవకాశం దక్కింది. దీంతో ఆమెను రాజ్యసభకు పంపుతారన్న ఊహాగానాలకు తెరపడిరది.