ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ముట్టడికి బయలుదేరిన జేఏసీ కార్మిక నాయకులు
టేకులపల్లి, సెప్టెంబర్ 26( జనం సాక్షి ): కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని 18 రోజుల నుండి నిరవదిక సమ్మె జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ,సింగరేణి యాజమాన్యం చర్చలకు ఆహ్వానించకుండా నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తుందని జేఏసీ నాయకులు డి ప్రసాద్ ,గుగులోతు రామచందర్, మారుతీ రావు, రాయండ్ల కోటిలింగం ,కడుగుల వీరన్న అన్నారు. జేఏసీ పిలుపులో భాగంగా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సోమవారం ముట్టడికి జేఏసీ నాయకులు, కార్మికులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దసరా పండగ సమీపిస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం పెడచెవిన పెట్టడం బాధాకరమన్నారు. నేడు జరిగే చర్చలలో వేతనం ఒప్పందం ,ఇతర సమస్యల పరిష్కారం చేయని యెడల భవిష్యత్తులో ఉదృతంగా టిఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టులా ఉద్యమిస్తామని హెచ్చరించారు. జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా సిపిఐ ఎంఎల్( ప్రజాపందా) మండల కార్యదర్శి ధర్మపురి వీర బ్రహ్మచారి .సిపిఐ ఎంఎల్( న్యూ డెమోక్రసీ )టేకులపల్లి మండల నాయకులు ఎట్టి నరసింహారావు పాల్గొని సంఘీభావం తెలియజేశారు .కాంట్రాక్టు కార్మికులు చేసే సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని మీ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సుందర్, శ్రీరాములు, రామారావు ,మాంగ్యా , రామ్ కుమార్, చిట్టిబాబు , నవీన్ ,రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.