ఎమ్మెల్యే ధర్మారెడ్డి ని కలిసిన తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం వరంగల్
జిల్లా అధ్యక్షులు కుమారస్వామి ప్రజాపతి
జనం సాక్షి, నర్సంపేట
తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో పరకాల శాసనసభ్యులు చల్ల ధర్మారెడ్డి ని కలిసి కుమ్మరి కులస్తుల హక్కులకై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గ్రామాలలో కమిటీ హాల్స్ మంజూరు చేయవలసిందిగా కోరగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు రుద్రారపు కుమారస్వామి ప్రజాపతి,రాష్ట్ర నాయకులు ఆవునూరి రామ్మూర్తి ప్రజాపతి, వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి సముద్రాల సావన్ కుమార్ ప్రజాపతి, నాంపల్లి ప్రభాకర్ ప్రజాపతి, మనోహర్ ప్రజాపతి, కృష్ణమూర్తి ప్రజాపతి, అశోక్ ప్రజాపతి, మల్లికార్జున ప్రజాపతి, సతీష్ ప్రజాపతి తదితరులు పాల్గొన్నారు.