ఎర్రవల్లి పూలవల్లి కావాలి
– ఆరునెలల్లో రూపురేఖలు మారాలి
– సీఎం కేసీఆర్ ఆకాంక్ష
మెదక్,ఆగస్ట్21(జనంసాక్షి):ఎర్రవల్లి పూలవెల్లి కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షిచారు. ఆరు నెలల్లో రూపు రేఖలు మానాలన్నారు. గ్రామజ్యోతిలో భాగంగా ఎర్రవల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో శ్రమదానం కార్యక్రమం జో7రుగా చేపట్టారు. ఉదయం సిఎం కెసిఆర్ దీనిని ప్రారంభించారు. గురువారం గ్రామాన్ని కలియతిరిగిన సిఎం శుక్రవారం శ్రమదానానికి పిలుపునిచ్చారు. ఆయన వ్యవసాయ క్షేత్రం ఈ గ్రామ పరిధిలోనే ఉండడం, ఇక్కడే పారిశుద్ద్య లోపం ఉండండంతో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ఇక్కడే పక్కాగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ముందు గ్రామస్థులను సవిూకరించి వారితో చర్చించారు. గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకునేందుకు కలసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ మేరకు గ్రామస్థులతో కలిసి శ్రమదానంలో సీఎం పాల్గొన్నారు. మధ్యాహ్నం గ్రామస్థులతో కలిసి సీఎం సహపంక్తి భోజనం చేసారు. సీఎం గురువారం ఎర్రవల్లిలో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న విషయం విదితమే. గ్రామజ్యోతిపై ప్రజలకు సీఎం దిశానిర్దేశం చేశారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. జెసిబిలను ట్రాక్టర్లను పిలిపించి ముందుగా గ్రామంలో చెత్తా చెదారాన్ని, పిచ్చిచెట్లను తొలగించారు. గ్రామాల్లో మార్పుకోసం యుద్ధం ప్రకటిద్దామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చాక ఎర్రవ్లలిలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందుకోసం గ్రామస్థులంతా సంఘటిత శక్తిగా మారి గ్రామజ్యోతిని వెలిగించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్రామాల పరిస్థితి చూస్తుంటే దుఃఖం వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేసిన సీఎం.. ప్రగతికి పట్టుకొమ్మలుగా నిలువాల్సిన గ్రామాలు ఇంకెన్నాళ్లు ఇలా మురికికూపంలో మగ్గాలని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చినా ప్రజల భాగస్వామ్యం లేనంతవరకు గ్రామ సమగ్రాభివృద్ధి అసాధ్యమని కేసీఆర్ ఆన్నారు. ఎర్రవల్లిలో సిఎం కలియతిరగగా పాతగోడలు,. ఇరుకు సందులు, పిచ్చిమొక్కలు, గట్టి వానపడితే కూలిపోయే పాడుబడ్డ ఇండ్లు దర్శనమిచ్చాయి. ఎక్కడి మరుగునీరు అక్కడే కనిపించింది. చెత్తను వేయడానికి డంపింగ్ యార్డులు లేవు. మురికి తుమ్మలు, జిల్లేడు చెట్లు మాత్రం పెరిగినయ్. ఇవి గ్రామానికి అరిష్టం. ఉద్యోగాల కోసమో, వ్యాపారం కోసమో, పని కోసమో వెళ్లిన వారి ఇండ్లు పడావు పడి ఉంటున్నాయి. గ్రామాలకు ఏదో రూపంలో నిధులు వస్తనే ఉన్నాయి. ఖర్చు అవుతున్నయి. స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నా గ్రామానికి ఏం కావాల్నో అది మాత్రం జరుగుతలేదు. జనం సమస్యలతోనే సర్దుకు పోతున్నారంటూ సిఎం గురువారం ఎర్రవల్లిలో విచారం వెలిబుచ్చారు. అంకాపూర్, గంగదేవిపల్లి గ్రామాల ప్రజల అంకుఠిత దీక్ష, పట్టుదల వల్లే నేడు ఆ గ్రామాలు అగ్రభాగాన ఉన్నాయి. ఆ గ్రామ ప్రజలకు అభివృద్ధిపై ఉన్న తపన అన్ని రంగాలలో విజయాలను సాధించి పెట్టింది. ఏ సహాయ సహకారాలు లేకుండా వాళ్లు అంత అభివృద్ధి సాధిస్తే, ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలు సమకూర్చుతుండగా మిగతా గ్రామాలు ఎందుకలా కాకూడదో ఆలోచించాలి అన్నారు. అందుకే ఎర్రవల్లిని తీర్చిదిద్దేందుకు నడుంబిగించారు. ఈ కార్యక్రమంలో సిఎం కెసిఆర్‌తో పాటు ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమిష్టి కృషితో విజయాలు సాధించవచ్చు : సీఎం కేసీఆర్
శ్రమిస్తే ఎలాంటి భూమిలోనైనా పంటలు పండిచుకోవచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సమిష్టిగా కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చని అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా ఎర్రవల్లి గ్రామసభలో ఆయన మాట్లాడుతూ ఊరును పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యంగా ఉంటామన్నారు. ఆరోగ్యం శుభ్రంగా ఉండాలని,సంతోషంగా బతకాలని అన్నారు. ఎర్రవల్లిలో ఇల్లు లేని మనిషి ఉండొద్దన్నదే తన సంకత్పమన్నారు. హైదరాబాద్‌లో ఉన్న విధంగా మంచి వసతులతో ఇళ్లు కట్టించి ఇస్తానని ప్రజలకు హావిూ ఇచ్చారు. చెత్తను బజార్లలో వేయొదని, ఎర్రవల్లి గ్రామంలో ప్రతి ఇంటికి 2 చెత్తబుట్టలు తానే కొనిస్తానని కేసీఆర్ అన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామంలో శ్రమదానంతో వీధులన్నీ శుబ్రం చేశారు. ఈ కార్యక్రమం శనివారం కూడా కొనసాగుతుందని అన్నారు. తాను కరీంనగర్ పర్యటనకు వెళతానని, అక్కడా కొందరిని చైతన్యం చేయాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్‌ఇ గ్రామాభివృద్దికి 50 లక్షలు, కలెక్టర్ నుంచి 25 లక్షలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అలాగే గ్రామానికి చెందిన వారు పలువురు విరాళాలు ప్రకటించారు. ఈ సందర్బంగా పలువురిని సిఎం సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.