ఎసిబి వలలో విఆర్‌వో

పెద్దపల్లి,మే21(జ‌నం సాక్షి): ఎసిబి వలలో విఆర్‌వో చిక్కాడు. కాల్వశ్రీరాంపూర్‌ మండలం మొట్లపల్లి వీఆర్‌వో.. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా వీఆర్‌వో కొమురయ్యను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మ్యుటేషన్‌ కోసం వీఆర్‌వో లంచం డిమాండ్‌ చేశారు. వీఆర్‌వో కార్యాలయంతో పాటు ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం.