ఎస్‌ఎస్‌సికి ఎంపికైన యువకులకు సిఐ అభినందన

జ్యోతినగర్‌, జూన్‌ 18, (జనం సాక్షి):
స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సి)కు ఎంపికైన గోదావరిఖని ఎన్టీపీసీకి చెందిన ఆకుల ప్రశాంత్‌, సుద్దాల రంజిత్‌లను సోమవారం రామగుండం సిఐ రాజేంద్రప్రసాద్‌ అభినందించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ… యువత పట్టుదలతో శ్రమించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఈ కార్యక్రమంలో గోలివాడ ప్రసన్నకుమార్‌, గడ్డం శంకర్‌లు పాల్గొన్నారు.