ఎస్‌టిలకు ప్రాధాన్యం లేదు: సూర్యనాయక్
హైదరాబాద్,జనంసాక్షి: ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌లో ఎస్‌సిలకు ఇచ్చింత ప్రాధాన్యత ఎస్‌టిలకు ఇవ్వడం లేదని ట్రైఫెడ్ ఛైర్మన్ సూర్యనాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సబ్‌ప్లాన్‌కు సంబధించిన కార్యక్రమాలు దళితవాడల్లో పెడుతున్నారు కాని గిరిజనవాడల్లో పెట్టడం లేదన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని భాధపడ్డారు. టీటీడీ, భద్రాచలం వంటి ఆలయాల్లో సీఎం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.