ఎస్ ఐ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలలో అర్హత సాధించిన ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ విద్యార్థులు.

తొర్రూర్ 23 అక్టోబర్ (జనంసాక్షి )
ఈరోజు తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన ఎస్సై మరియు కానిస్టేబుల్ పోస్టులలో అర్హత పొందిన వారు సమావేశం అయినారు వారు మాట్లాడుతూ ఉద్యోగాలలో విపరీతమైన పోటీ ఉండి కోచింగ్ కు హైదరాబాదు లాంటి పట్టణాలకు వెళ్లి భోజనం తీసుకోవడం ఎక్కువ ఖర్చుతో కూడుకున్నందున ఈ ప్రాంతం పేద నిరుద్యోగులకు ఇబ్బంది పడకుండా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తమ ఎర్రబెల్లి దయాకర్ రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చైర్ పర్సన్ అయినా ఎర్రబెల్లి ఉషమ్మ కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ కోచింగ్ సెంటర్ హైదరాబాద్ వారి ద్వారా 90 రోజుల ఉచిత మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించి, ఉచిత స్టడీ మెటీరియల్ ఇచ్చి నాణ్యమైన కోచింగ్ ద్వారా మేము క్వాలిఫై అయినాము ఎస్ఐ పోస్టులకు సుమారు 50 మంది పైగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు 190 మంది అర్హత పొందారు అభ్యర్థులందరూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ట్రైనింగ్ వేర్వేరు ప్రాంతాల్లో తీసుకుంటున్నారు కావున అందరం హాజరు కాలేకపోయామన్నారు. ఈ సందర్భంగా వారు మంత్రి ఎర్రబెల్లి దయన్న కి, ఉషమ్మ గారికి కృతజ్ఞతలు తెలిపారు. వారు కల్పించిన ఈ అవకాశాన్ని మా జీవితాల్ని ఎదగడానికి వినియోగించుకుంటామని వారికి మేము ఎల్లవేళలా రుణపడి ఉంటామని తెలిపారు
ఈ కార్యక్రమంలో తొర్రూర్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పసుమర్తి సీతారాములు ,తొరూర్ మండల జడ్పిటిసి జిల్లా ఫ్లోర్ లీడర్ మంగళంపల్లి శ్రీనివాస్ , తొర్రూర్ మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య  తోరూర్ వైస్ ఎంపీపీ ఇట్టే శ్యాంసుందర్ రెడ్డి గారు, నాయకులు రాయిశెట్టి వెంకన్న , ఎర్రం రాజు,క్వాలిఫై అయిన అభ్యర్థులు పారనంది సుదర్శన్, బోలగాని స్వాతి ,బానోత్ బాలాజీ, కత్తోజు భాస్కరాచారి, భరత్, నవీన్ ఎనగందుల, ప్రశాంత్ ,కృష్ణ దయాకర్,నాగరాజు ,సురేష్ ,సతీష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు