ఏజెన్సీ పరిరక్షణ మండల అధ్యక్షుడుగా మాలోత్ అనిల్ నాయక్

టేకులపల్లి, సెప్టెంబర్ 16(జనం సాక్షి ): ఏజెన్సీ పరిరక్షణ కమిటీ టేకులపల్లి మండల అధ్యక్షునిగా మద్రాస్ తండా గ్రామ నివాసి అయిన మాలోత్ అనిల్ నాయక్ ను ప్రకటిస్తూ ఆ సంస్థ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మాలోత్ అశోక్ నాయక్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం విలేకరులకు తెలిపారు . ఏజెన్సీ పరిరక్షణ కమిటీ లోకి అనిల్ రావడం అభినందనీయం అన్నారు .గతంలో భారత సైన్యంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తూ ఎన్నో ప్రశంశాలు అందుకొని దేశ రక్షణ కోసం నిత్యం పరితపించేవాడని ఇటువంటి గొప్ప సైనికుడు గిరిజన ప్రాంత ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఆర్మీ ఉద్యోగాన్ని సైతం వదులుకొని తమ కమిటీల్లో పూర్తిస్థాయిలో పనిచేసేందుకు మండల అధ్యక్షుడు బాధ్యతలు తీసుకోవడం గిరిజనుల పరిరక్షణకు పాటుపడతాడని అన్నారు . ఆర్మీలో పని చేస్తూ సెలవులపై వచ్చిన తన సొంత ప్రయోజనాలు పక్కన పెట్టి సేవా కార్యక్రమాల లో పాలుపంచుకోవడం ఎంతో హర్షించదగిన విషయం అన్నారు .అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తిగా అమాయక గిరిజనులు నివసిస్తున్న అటువంటి ఏజెన్సీ  ప్రాంతమని అట్టి ఏజెన్సీ ప్రాంతంలో ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా అనేక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఏజెన్సీ లో ఉన్నటువంటి గిరిజనల హక్కులను కాలరాస్తూ అటువంటి విషయంపై జిల్లాలో ఏజెన్సీ చట్టాన్ని పకడ్బందీగా అమలు కావడానికి దశలవారీగా కార్యక్రమాలు చేస్తూ అన్ని వర్గాల  ప్రజలను కలుపుకొని చట్టాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు గా ఎన్నికైనటువంటి అనిల్ నాయక్ మాట్లాడుతూ గత కొంత కాలంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అమాయక ప్రజల సమస్యలపై వెంటనే స్పందిస్తూ రాజీలేని కార్యక్రమాల ద్వారా వాటిని పరిష్కరిస్తూ ఏజెన్సీ పరిర�