ఏటా పెరుగుతున్న పెళ్లి ఖర్చులు
ధనిక, పేదలనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ వివాహ వేడుక మరుపురాని జ్ఞాపకం. తమ ఇంట జరిగే వివాహ వేడుకను ఉన్నంతలో ఘనంగా నిర్వహించుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. గతంలో వధూవరుల ఆర్థిక స్థోమత ఆధారంగా ఈ వేడుక నిర్వహణ అనేది ఆధార పడి ఉండేది. ప్రస్తుతం ఆర్థికంగా భారమైన ప్రతి ఒక్కరూ ఘనంగా నిర్వహించేందుకే ఆసక్తి చూపుతున్నారు.
ఈ నెలల నుంచి..
మాఘమాసం ప్రారంభం కావడంతో ఈ నెల ఆరో తేదీ నుంచి ముహూర్తాలు ప్రారంభమయ్యాయి. జూన్ వరకు పెళ్లిళ్లకు ముహూర్తాలు ఉన్నాయి. జూన్ తర్వాత ఆషాఢం, మూఢం ఉండటంతో ఆ లోగానే వివాహాలు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
నింగిలో నిత్యవసరాలు..
ప్రస్తుతం సాధారణ భోజనం ప్లేటుకు రూ.250, ఘనంగా పెట్టాలంటే రూ.850 నుంచి రూ.10పెరిగిన మండపాల అద్దెలు..కోనసీమ జిల్లా వ్యాప్తంగా దాదాపు 4వేల నుంచి 5వేల వరకు కల్యాణ మండపాలు, పలు ఆలయాల్లో వివాహాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో సాధారణ కల్యాణ మండపం అద్దె గతంలో రోజుకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఉండేది. ప్రస్తుతం రూ.60 వేల నుంచి రూ80 వేల వరకు వసూలు చేస్తున్నారు. సౌకర్యాలు, సీజన్‌ను బట్టి కొన్నిచోట్ల రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ తీసుకుంటున్నారు.00 వరకు వసూలు చేస్తున్నాô.
. ఇటీవల అల్పాహారం ట్రెండ్‌గా మారింది. దీనికి ప్లేటుకు రూ.180 వరకు వసూలు చేస్తున్నారు. వీటికి పళ్లరసాలు, శీతలపానీయాలు, చిరుతిళ్లు, వంటివి అదనం. సారెలు, పెళ్లిళ్లలో అందించే స్వీట్లకు అదనంగా సొమ్ము పెట్టాల్సిందే.
పసిడి పైపైకి..
గతంతో పోలిస్తే బంగారం ధర 10 గ్రాములకు సుమారు రూ.20వేల వరకు పెరిగింది. సామాన్యులు ఒక వివాహానికి కనీసం 40 గ్రాముల బంగారమైనా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సంపన్నులైతే 50 తులాల వరకు కొంటుంటున్నారు.
వస్త్రాలపై జీఎస్టీ పోటు..
మధ్య తరగతి వివాహానికి సుమారు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వస్త్రాల కొనుగోలుకు వెచ్చిస్తున్నారు. జీఎస్టీ కారణంగా ప్రస్తుతం ఈ తరహా కొనుగోళ్లపై అదనంగా మరో రూ.70 వేలు చెల్లించాల్సి వస్తోంది.
పూలకు రెక్కలు..
పెళ్లి తంతు నిర్వహించేందుకు ప్రత్యేకంగా వివిధ రాకల పూలతో మందిరాలను ఆకర్షణీయంగా తీర్చి దిద్దుతారు. వీటి కోసం రూ.లక్షల్లో వెచ్చించాల్సి వస్తోంది. గతంలో వీటిని తయారు చేసే వారు రూ.30 నుంచి రూ.45 వేల వరకు తీసుకునే వారు. ప్రస్తుతం రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు.
వాయిద్యాల ఖర్చు మోత
గతంలో పుల్ బ్యాండ్‌కు రూ.30 వేల నుంచి రూ.45 వేలు తీసుకునేవారు. ప్రస్తుతం రూ.లక్ష వరకు వరకు వసూలు చేస్తున్నారు. తెల్లవారుజామున ముహూర్తాలు వస్తే పెళ్లి మండాల వద్ద అదనంగా సినీమ్యూజికల్ నైట్ ప్రోగ్రాం ఏర్పాటు చేయాల్సిందే. దీనికి ఖర్చు అదనం..
పెళ్లి కోసం డబ్బు దాచుకుంటున్న వారే ఎక్కువ
పిల్లల వివాహాన్ని అంగరంగ వైభవంగా చేయడానికి తల్లిదండ్రులు తగినంత పొదుపుతో ముందస్తుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు వెడ్‌మీగుడ్ సర్వేలో వెల్లడయ్యింది. 82 శాతం మంది వారి పిల్లల వివాహన్ని సొంతంగా దాచుకున్న నిధులు లేదా స్నేహితుల నుంచి తీసుకొని ఖర్చు చేస్తున్నట్లు తెలిపింది. 12 శాతం మంది మాత్రమే పెళ్లిళ్ల కోసం రుణాలు తీసుకుంటున్నారు. మరో 6 శాతం మంది పిల్లల పెళ్లిళ్ల కోసం ఆస్తులను విక్రయిస్తున్నట్లు పేర్కొంది.
మిలీనియల్స్, జనరేషన్ జెడ్‌కు చెందిన వివాహాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయని వెడ్‌మీగుడ్ సహ వ్యవస్థాపకుడు మెహక్ సాగర్ షహానీ పేర్కొన్నారు. పూర్తిగా పాశ్చాత్య సంప్రదాయాలకు అనుగుణంగా కాక్‌టెయిల్స్, గేమింగ్స్ , రెస్టారెంట్ ఏర్పాట్లు వంటివి ఏర్పాటు చేస్తున్నారు. వివాహాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసుకోవడం కోసం వీరు సోషల్ మీడియా మేనేజర్లను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు.
వీటివల్ల సరికొత్త వ్యాపార అవకాశాలు పుట్టుకొస్తున్నాయని మోహక్ సాగర్ పేర్కొన్నారు. ఏటా నవంబర్ – డిసెంబర్ నెలల్లోనే అత్యధిక వివాహాలు జరుగుతాయని, ఈ ఏడాది ఈ రెండు నెలల్లో దేశవ్యాప్తంగా 48 లక్షల వివాహాలు జరుగుతున్నాయని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేస్తోంది. ఈ రెండు నెలల్లో వివాహల కోసం రూ.6 లక్షల కోట్లు ఖర్చు చేస్తారని అంచనా.