ఐకెపి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
దౌల్తాబాద్ ఆగష్టు 19, జనం సాక్షి.
దౌల్తాబాద్ మండల కేంద్రంలో భారత స్వతంత్ర 75వ వజ్రోత్సవ దినోత్సవ సందర్భంగా ఐకెపి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మొదటి బహుమతి ఇందుప్రియలు శివలక్ష్మి,రెండవ బహుమతి లింగరాజుపల్లి సంగీత, మూడో బహుమతి ముత్యంపేట వనిత బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిపిఎం రాజయ్య, ఎం ఈవో నర్సమ్మ, ఏపీఎం కిషన్,పలు గ్రామాల సీసీలు, సిఏలు,తదితరులు పాల్గొన్నారు.